గం..గం..గణేశా అంటూ వచ్చేస్తున్న ఆనంద్‌ దేవరకొండ!

బేబీ సినిమాలో తన నటనతో అందరి కంట కన్నీరు పెట్టించిన ఆనంద్‌ దేవరకొండ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. విజయ్‌ దేవరకొండ తమ్మునిగా ఇండస్ట్రీకి పరిచయం అయినప్పటికీ… తన నటనతో అందరి హృదయాల్లో చెరగని ముద్ర వేసుకున్నాడు. శుక్రవారం పుట్టిన రోజు జరుపుకుంటున్న ఈ యంగ్‌ హీరో కి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ కొత్త సినిమా పోస్టర్‌ రిలీజ్‌ చేసింది చిత్ర బృందం.

ఆనంద్‌ దేవరకొండ ప్రస్తుతం గం..గం.. గణేశా అనే సినిమాలో నటిస్తున్నాడు. ఆనంద్‌ ఇప్పటి వరకు తన కెరీర్‌ లో అన్ని కుటుంబ కథా చిత్రాలే చేశాడు. మొదటిసారి యాక్షన్‌ కథా చిత్రం చేయబోతున్నాడు. ఈ చిత్రాన్ని హై లైఫ్‌ ఎంటర్‌ టైన్‌మెంట్‌ పతాకం పై కేదార్‌ సెలగం శెట్టి, వంశీ కారుమంచి సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

ఈ చిత్రం ద్వారా ఉదయ్‌ శెట్టి దర్శకునిగా తెలుగు తెరకు పరిచయం కాబోతున్నాడు. గం…గం..గణేశా మూవీ కొత్త పోస్టర్‌లో ఆనంద్‌ రకరకాల ఆయుధాలను పట్టుకుని ఉన్నాడు. తన మీదకు వస్తున్న విలన్స్‌ ను నవ్వుతూ చూస్తున్నట్లుగా ఈ పోస్టర్‌ ఉంది. అంతేకాకుండా అదే పోస్టర్‌ లో గులాబీ పువ్వును ఇస్తున్న హీరోయిన్‌ చేయి కూడా ఉంది.

ఓ పక్క ఆయుధాలు..మరో పక్క గులాబీ పువ్వును చూపించడం ఆసక్తిగా ఉంది. అతిత్వరలోనే ఈ సినిమా థియేటర్లలో సందడి చేయనున్నట్లు చిత్ర బృందం వెల్లడించింది. 

Related Posts

Comments

spot_img

Recent Stories