టాలీవుడ్ యంగ్ హీరోల్లో ఒకరైన నవీన్ పొలిశెట్టి ప్రధాన పాత్రలో వస్తున్న లేటెస్ట్ సినిమా అనగనగా ఒక రాజు ఇప్పుడు మళ్లీ వార్తల్లోకి వచ్చింది. ఈ సినిమా మొదలైనప్పుడు నుంచి మంచి క్రేజ్ ఉంది. అయితే మధ్యలో కొంతకాలం గ్యాప్ రావడం, తర్వాత మళ్లీ అప్డేట్స్ ఇవ్వడం ఇలా జరిగాయి. ఆ అప్పటి నుంచి అభిమానులు సినిమా రీలీజ్ మీద ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
ఇప్పుడు చిత్ర యూనిట్ చివరకి ఎప్పుడెప్పుడు అనుకున్నట్టు ఒక క్లారిటీ ఇవ్వడానికి సిద్ధమవుతున్నారు. ఈ సినిమాకు సంబంధించిన ఒక చిన్న ప్రోమో కట్ రిలీజ్ చేయబోతున్నారు. ఈ ప్రోమో ద్వారా సినిమా విడుదల తేదీపై రేపు అంటే మే 26 సాయంత్రం 4 గంటల 6 నిమిషాలకు అప్డేట్ ఇవ్వబోతున్నట్టు ప్రకటించారు. అంటే అభిమానులకు ఈ లాంగ్ వేటు ఎప్పుడు ముగుస్తుందో రేపు స్పష్టత వస్తుంది.
ఈ సినిమాను సితార ఎంటర్టైన్మెంట్స్యు, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇప్పటికే వచ్చిన చిన్న చిన్న అప్డేట్స్ ద్వారా ఈ సినిమా మీద మంచి బజ్ ఏర్పడింది. ఇప్పుడు రేపు రానున్న అప్డేట్ ఈ ఉత్సాహాన్ని మరింత పెంచబోతోందని చెప్పొచ్చు.