చెర్రీ బర్త్‌ డే రోజు అదిరిపోయే అప్డేట్‌ !

చరణ్‌ బర్త్‌ డే సందర్భంగా అభిమానులకు అదిరిపోయే అప్డేట్‌ చెప్పారు గేమ్‌ చేంజర్‌ చిత్ర బృందం. మార్చి 27 ఉదయం 9 గంటలకు జరగండి సాంగ్‌ ను విడుదల చేయనున్నట్లు మూవీ మేకర్స్‌ తెలిపారు. ఈ విషయం గురించి చిత్ర బృందం ఓ పోస్టర్‌ ని విడుదల చేసింది. ఈ పోస్టర్‌ లో చరణ్‌ లుక్‌ అదిరింది. ఈ సినిమాకు తమన్‌ సంగీతం అందిస్తున్న విషయం తెలిసిందే.

చరణ్‌ ప్రధాన పాత్రలో దర్శకుడు శంకర్‌ దర్శకత్వంలో రాబోతున్న చిత్రం గేమ్‌ చేంజర్‌. ఈ సినిమా పొలిటికల్‌ యాక్షన్‌ సినిమాగా చెప్పుకొవచ్చు. ఎందుకంటే ఈ సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన పోస్టర్‌ ద్వారా ఈ విషయం తెలుస్తుంది. అంతేకాకుండా ఈ సినిమా వైజాగ్‌ లో షూటింగ్‌ జరుపుకుంటున్న క్రమంలో కూడా సినిమా సెట్స్ నుంచి చరణ్‌ వి కొన్ని ఫోటోలు బయటకు వచ్చాయి.

అందులో చరణ్‌ క్లాసీ లుక్‌ లో అదిరిపోయాడు. ఈ సినిమాలో చరణ్‌ సరసన బాలీవుడ్‌ భామ కియారా అద్వానీ నటిస్తుండగా.. అంజలి, శ్రీకాంత్‌, ఎస్‌ జే సూర్య, సముద్ర ఖని, శ్రీకాంత్‌ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. శంకర్‌ ఇండియన్‌ 2 సినిమాతో బిజీగా ఉండడం వల్ల ఈ సినిమా  చిత్రీకరణ ఆలస్యమైన విషయం తెలిసిందే.

చరణ్‌ బర్త్‌ డే సందర్భంగా చిత్రం నుంచి సాంగ్‌ వస్తుందని తెలుసుకున్న అభిమానులు పిచ్చ సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు.

Related Posts

Comments

spot_img

Recent Stories