స్పిరిట్‌ లో ఊహించని సర్ప్రైజ్‌!

డైరెక్టర్ సందీప్‌ రెడ్డి వంగా దర్శకత్వంలో ప్రభాస్‌ హీరోగా స్పిరిట్‌ సినిమా పై క్రేజ్‌ మామూలుగా లేదు. పాన్ ఇండియా రెబల్‌ స్టార్ ప్రభాస్‌..వరుసగా రెండు హిట్‌ ల తర్వాత ఈ సినిమా వస్తుండడంతో అందరిలోనూ ఆసక్తి పెరిగిపోయింది. నాగ్‌ అశ్విన్‌ డైరెక్షన్‌ లో ప్రభాస్‌ హీరోగా చేసిన ఈ సినిమా ఇప్పటికే రూ. 1,100 కోట్ల కలెక్షన్లు దాటేసిన సంగతి తెలిసిందే.

సినిమా విడుదలై దగ్గరదగ్గర నాలుగు వారాలు కావొస్తున్నప్పటికీ ఇంకా అదే జోరు కనబరుస్తోంది. ప్రభాస్ ప్రస్తుతం రాజాసాబ్ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఆ తర్వాత సెన్సేషనల్ డైరెక్టర్ సందీర్ రెడ్డి వంగాతో స్పిరిట్ మూవీ చేయబోతున్నారు. మోస్ట్ వైలెంట్ మూవీ యానిమల్‍తో సందీప్ బాక్సాఫీస్‌ వద్ద బ్లాక్‍బస్టర్ హిట్ అందుకున్న సంగతి తెలిసిందే.

తీవ్రమైన విమర్శలు వచ్చినా ఆ చిత్రం బాక్సాఫీస్ వద్ద సూపర్‌ సక్సెస్ అయింది. ప్రభాస్‍తో సందీప్ చేయబోయే సినిమా గురించి ఆసక్తి అందరిలో విపరీతంగా ఉంది. ఈ మూవీలో పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా ప్రభాస్ నటిస్తారని సందీప్ కొంతకాలం క్రితం ప్రకటించిన సంగతి తెలిసిందే. స్పిరిట్ మూవీ  గురించి ఓ క్రేజీ రూమర్ తాజాగా బయటికి వచ్చింది. డైరెక్టర్ సందీప్‌ వంగ తన హీరోలను అంతకు మించి అనేలా చూపిస్తుంటాడు. స్పిరిట్‌ సినిమాలో ఇప్పటివరకు చూడని ప్రభాస్‌ను చూపించబోతున్నట్లు సమాచారం. పాన్ ఇండియా కటౌట్ ప్రభాస్‌ను ఇంకే రేంజ్‌లో ప్రజెంట్ చేస్తాడనే ఆసక్తి అందరిలో నెలకొంది.

స్పిరిట్ సినిమాలో ప్రభాస్ డ్యుయల్ రోల్ చేస్తారనే రూమర్ తాజాగా వినిపిస్తుంది. ఈ చిత్రంలో ప్రభాస్ కోసం ఆయన రెండు పాత్రలను రెడీ చేసుకుంటున్నారంట. ప్రభాస్ చేయనున్న ఓ క్యారెక్టర్ నెగెటివ్‍గా ఉండనున్నట్లు తెలుస్తోంది. మరో పాత్ర పాజిటివ్‍గా ఉండనుందని టాక్‌. అయితే, సందీప్ ఇప్పటికే చెప్పిన పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్ ఈ రెండింట్లో ఎలా ఉంటుందో అనే దాని గురించే అందరిలో  ఆసక్తి నెలకొంది. అంతేకాదు.. ఇంటర్వెల్‌ బ్యాంగ్‌లో ప్రభాస్ రెండో పాత్ర రివీల్ అవుతుందని.. సినిమా మొత్తానికే ఈ సీక్వెన్స్ మెయిన్ హైలైట్‌గా ఉండేటట్లు సందీప్‌ తన సినిమాని రెడీ చేస్తున్నాడంట.

ఇందులో ఎంతవరకు నిజముందో తెలియదు కానీ, ప్రభాస్ డ్యూయెల్ రోల్ అనే న్యూస్ మాత్రం అభిమానులకు ఖుషీ నింపే వార్తే. అసలు.. సందీప్‌ సినిమాలో ఒక్క హీరోని తట్టుకోవడమే కష్టం అంటే, అందులో డ్యూయెల్ రోల్, పైగా పాజిటివ్ నెగెటివ్ అంటున్నారంటే, బాక్సాఫీస్ దగ్గర స్పిరిట్‌ను తట్టుకోవడం కష్టమే మరి.

Related Posts

Comments

spot_img

Recent Stories