నీల్‌-తారక్‌ సినిమా పై ఓ ఆసక్తికర అప్డేట్‌!

మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ హీరోగా నటించిన తాజా  భారీ సినిమా “దేవర”. ఈ మూవీ తో మంచి హిట్ ని అందుకున్న తారక్‌ ఆ తరువాతవరుస సినిమాలతో ముందుకు దూసుకుపోతున్నాడు. అరవింద సమేత సినిమా తర్వాత తన నుంచి డైరెక్ట్ గా వచ్చిన చిత్రం ఇది. కాగా ఈ సినిమా తర్వాత పలు సెన్సేషనల్ సినిమాలతో తాను ఫుల్‌ బిజీగా ఉన్నాడు.

మరి ఈ చిత్రాల్లో పాన్ ఇండియా సెన్సేషనల్ మాస్ దర్శకుడు ప్రశాంత్ నీల్ ప్రాజెక్ట్ కూడా ఒకటి. దీనిపై కూడా నెక్స్ట్ లెవెల్ హైప్ ఉండగా ఈ సినిమా నుంచి రానున్న రోజుల్లో ఓ క్రేజీ ట్రీట్ ఉండనున్నట్లు తెలుస్తుంది. దీంతో సినిమా టైటిల్ ని అయితే మేకర్స్ వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా ప్రకటించనున్నట్లుగా ఇపుడు తెలుస్తుంది. ఆల్రెడీ ఈ సినిమాకి “డ్రాగన్” అనే పవర్ఫుల్ టైటిల్ ను పరిశీలిస్తున్నారు.మరి దీనినే ప్రకటిస్తారా లేక వేరే ఏమన్నా ఉంటుందా అనేది మాత్రం ఎదురు చూడాల్సిందే.

Related Posts

Comments

spot_img

Recent Stories