గేమ్‌ ఛేంజర్‌ సినిమా పై అదిరిపోయే అప్డేట్‌!

గ్లోబల్‌ స్టార్‌ రామ్‌ చరణ్‌ నటిస్తున్న లేటెస్ట్‌ మూవీ గేమ్‌ చేంజర్‌ ఈ సినిమాని కోలీవుడ్‌ స్టార్‌ డైరెక్టర్‌ శంకర్‌ తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే.
ఈ సినిమాలో రాంచరణ్ సరసన బాలీవుడ్ ముద్దుగుమ్మ కియారా అద్వానీ హీరోయిన్ గా చేస్తుంది. అలాగే క్యూట్ బ్యూటీ అంజలి ఈ సినిమాలో ముఖ్య పాత్ర పోషిస్తున్న విషయం తెలిసిందే.

ఈ సినిమా షూటింగ్ ఎప్పుడో మొదలైన కూడా దర్శకుడు శంకర్ ఇండియన్ 2 సినిమాతో బిజీ గా ఉండటంతో ఈ సినిమా షూటింగ్ ఆలస్యం అవుతూ వచ్చేసింది. గత మూడేళ్ళుగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా షూటింగ్ ఇంకా పూర్తి కాలేదు. అలాగే గేమ్ ఛేంజర్ షూటింగ్ త్వరలోనే పూర్తి చేసేందుకు సిద్ధం అవుతన్నాడు. ఇదిలా ఉంటే ఈ నెలలోనే గేమ్ ఛేంజర్ షూటింగ్ ప్రారంభమవుతుంది.

తాజాగా రాజమండ్రిలో ఓ షెడ్యూల్ ను చిత్ర బృందం ప్లాన్ చేస్తున్నారు. జూన్ 7 లేక 9న ఈ షెడ్యూల్ మొదలు కానుందని సమాచారం. దాదాపు వారం రోజుల పాటు ఈ షెడ్యూల్ జరగనుందని సమాచారం. సినిమాలలోని పలు కీలక సన్నివేశాలను ఈ షెడ్యూల్ లో తెరకెక్కించనున్నట్లు టాక్‌. అయితే ఈ మూవీని అక్టోబర్ లో రిలీజ్ చేసే అవకాశం ఉందని నిర్మాత దిల్ రాజు కూతురు ఇటీవల ప్రకటించారు. అయితే ఈ సినిమా షూటింగ్ పూర్తి అయితే గాని రిలీజ్ డేట్ పై క్లారిటీ వచ్చేలా లేదని తెలుస్తుంది.

Related Posts

Comments

spot_img

Recent Stories