ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌ నుంచి అదిరిపోయే అప్డేట్‌!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా ఆయన అభిమానులకు ప్రత్యేక గిఫ్ట్ అందింది. ‘ఉస్తాద్ భగత్ సింగ్’ టీం ఓ స్టైలిష్ పోస్టర్‌ని విడుదల చేసి ఫ్యాన్స్‌ని ఆనందంలో ముంచేసింది. ఈ చిత్రాన్ని హరీష్ శంకర్ తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. బ్లాక్‌బస్టర్‌గా నిలిచిన ‘గబ్బర్ సింగ్’ తర్వాత పవన్‌తో ఆయన చేస్తున్న రెండో సినిమా కావడంతో ఈ ప్రాజెక్ట్‌కి భారీ అంచనాలు ఉన్నాయి.

ఇక తాజాగా ఈ సినిమాపై మరో ఆసక్తికరమైన వార్త బయటకి వచ్చింది. రాబోయే శనివారం నుంచి కొత్త షెడ్యూల్ మొదలవుతుందని, ఆ షెడ్యూల్‌ని పవన్ కళ్యాణ్‌పై చిత్రీకరించే ఎనర్జిటిక్ డ్యాన్స్ సాంగ్‌తో స్టార్ట్ చేయబోతున్నారని సమాచారం. ఈ పాట కోసం దేవి శ్రీ ప్రసాద్ మాస్ బీట్స్‌తో ట్యూన్ అందించగా, దినేష్ మాస్టర్ స్టైలిష్ కొరియోగ్రఫీ చేయనున్నారు. సినిమాను పూర్తిగా కమర్షియల్ ఎంటర్టైనర్‌గా మలచాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారని చెబుతున్నారు.  

Related Posts

Comments

spot_img

Recent Stories