రామ్‌ చరణ్‌ కి తాతయ్యగా అమితాబ్‌!

గ్లోబల్‌ స్టార్‌ రామ్‌ చరణ్‌ కథానాయకుడిగా.. జాతీయ అవార్డు డైరెక్టర్‌ బుచ్చిబాబు సానాతో కలిసి ఓ భారీ చిత్రాన్ని నిర్మించబోతున్న విషయంయ తెలిసిందే. ఈ సినిమా అప్డేట్స్‌ కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.  తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఓ కీలక అప్డేట్‌ అభిమానుల ముందుకు వచ్చింది.

ఇప్పటికేఈ సినిమాలో బాలీవుడ్‌ భామ జాన్వీ కపూర్‌ హీరోయిన్‌ గా నటిస్తుండగా.. తాజాగా ఈ సినిమాలో మరో బాలీవుడ్‌ నటుడు సినిమాలో కీలక పాత్ర పోషిస్తున్నట్లు సమాచారం. ఆయన ఎవరో కాదు.. బాలీవుడ్‌ బిగ్‌ బి అమితాబ్‌ బచ్చన్‌. ఆయన ఈ సినిమాలో చరణ్‌ కి తాతగా నటించబోతున్నాడని టాక్‌ వినిపిస్తుంది.

తాతయ్య మనవడి మధ్య రిలేషన్‌ ఈ సినిమాలో హైలెట్‌ గా ఉంటుందని సమాచారం.. తాతయ్య కోరిన కోరిక మనవడు ఏం సాధించాడు అనే కోణంలో ఈ సినిమా సాగుతుందని టాక్‌. ఈ సినిమాకు ఏఆర్‌ రెహమాన్‌ సంగీతం అందిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో బాబీ డియోల్ విలన్‌ గా నటిస్తున్నట్లు టాక్ వినిపిస్తుంది కానీ ఎంత వరకు నిజము అనేది తెలియాల్సి ఉంది.

Related Posts

Comments

spot_img

Recent Stories