అంబటి అరాచకానికి కూల్చివేతలతోనే చెక్!

జగన్మోహన్ రెడ్డి పరిపాలించిన బ్లాక్ పీరియడ్ లో తన అన్న మంత్రిగా కూడా వెలగబెడుతున్నారు. అసలే అరాచకాలకు పేరుమోసిన నేతలు.. పైగా అధికారం దన్నుగా ఉంది. ఇక వారు చెలరేగిపోవడానికి అడ్డేముంటుంది. గుంటూరులోని పట్టాభిపురంలో అడ్డగోలుగా సాగిస్తూ వస్తున్న అరాచక నిర్మాణాలకు ఇప్పుడు ప్రభుత్వం చెక్ పెట్టనుంది. మాజీ మంత్రి అంబటి రాంబాబు సోదరుడు అంబటి మురళీక‌ృష్ణకు  చెందిన గ్రీన్ గ్రేస్ అపార్టుమెంట్ల్ నిర్మాణం అడుగడుగునా నిబంధనల ఉల్లంఘనకు ప్రతిరూపంగా, విచ్చలవిడితనానికి ప్రతీకగా విజిలెన్సు విచారణలో రుజువు  కావడం, ఈ అక్రమాలకు సంబంధించి నోటీసులు ఇచ్చినాసరే.. ఎలాంటి వివరణలు ఇవ్వడానికి కూడా యాజమాన్యం ముందుకు రాకపోవడంతో ప్రభుత్వం నిర్మాణంలో ఉన్న వాటిని కూల్చివేయడానికి రంగం సిద్ధం చేస్తున్నట్టుగా తెలుస్తోంది.

మాజీ మంత్రి అంబటి రాంబాబుకు అంబటి మురళీ కృష్ణ తమ్ముడు. ఆయన గుంటూరు పట్టాభిపురంలో అడుగడుగునా నిబంధనలను అతిక్రమిస్తూ.. సర్కారు మాదే.. ఎవరేం చేయగలరు? అన్నట్టుగా చెలరేగుతూ భారీస్థాయి అపార్టుమెంట్ల నిర్మాణం చేపట్టారు. ఈ గ్రీన్ గ్రేస్ అపార్టుమెంట్స్ రైల్వేలైనుకు పక్కనే వస్తాయి. వాటి నిర్మాణానికి రైల్వేశాఖ అనుబతి కూడా తప్పనిసరి. అయితే రైల్వేతో పాటు పీసీబీ, అగ్నిమాపక, నగరపాలక శాఖల్లో ఏ ఒక్కరినుంచి కూడా పూర్తి అనుమతులు తీసుకోనేలేదు. కార్పొరేషన్ కు ఫీజులు కూడా చెల్లించలేదు. రైల్వేశాఖ ఆ స్థలంలో జీ+4 కు మాత్రమే ఎన్వోసీ అనుమతులు ఇవ్వగా.. ఆయనేమో హైరైజ్ బిల్డింగులు నిర్మింస్తూ దూసుకెళ్లిపోయారు. దానిని గమనించిన రైల్వే అధికారులు తాము ఇచ్చిన ఎన్వోసీని రద్దు చేస్తూ ఆ విషయం గుంటూరు కార్పొరేషన్ కు కూడా లిఖితపూర్వకంగా తెలియజేశారు. అంబటి ఫ్యామిలీ అధికారపార్టీ కి చెందినది కావడం వల్ల వారు పట్టించుకోలేదు. నిర్మాణాలు చకచకా సాగుతూ వచ్చాయి.

ఎన్డీయే కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత.. రైల్వేశాఖ ఎన్వోసీ లేకుండానే సాగుతున్న నిర్మాణా లపట్ల పొన్నూరు ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర చౌదరి ఫిర్యాదు చేయడంతో.. గుంటూరు కార్పొరేషన్ విచారణకు ఆదేశించింది. విజిలెన్సు విచారణలో అక్రమాలన్నీ బయటపడ్డాయి. రద్దయిన రైల్వే ఎన్వోసీనే సబ్మిట్ చేసి మోసపూరితంగా కొన్ని అనుమతులు పొందినట్తు తేలింది. దీంతో ఆ నిర్మాణాలను ఎందుకు కూల్చివేయకూడదో, ప్రాసిక్యూట్ చేయకూడదో చెప్పాలని గుంటూరు కార్పొరేషన్ షోకాజు నోటీసులు ఇచ్చింది. అంబటి మురళీకృష్ణ హైకోర్టును ఆశ్రయించారు. రెండు వారాల పాటు చర్యలు తీసుకోవద్దని కోర్టు చెప్పడంతో వ్యవహారానికి బ్రేక్ పడింది. కోర్టు ఉత్తర్వులు క్లియర్ కాగానే.. ఈ అక్రమ కట్టడాలను కూల్చివేయడానికి గుంటూరు కార్పొరేషన్ రంగం సిద్ధం చేసుకుంటున్నట్టుగా తెలుస్తోంది. అధికారం అడ్డుపెట్టుకుని చెలరేగిపోతే ఎప్పటికైనా పనిష్మెంట్ తప్పదని ఈ వ్యవహారం నిరూపిస్తోంది.

Related Posts

Comments

spot_img

Recent Stories