అల్లు అరెస్టుపై అతి చేస్తున్న అంబటి!

‘ఉదయం వేళలో సూర్యుడు తూర్పుగా ఎర్రగా కనిపిస్తున్నాడయ్యా’ అని ఎవరైనా అంటే.. ‘రాత్రి మేం చితక్కొట్టేశాం.. అందుకే అలా మొహం కందిపోయింది’ అని ఎవరైనా సమాధానం చెప్పారనుకోండి. దాని అర్థం ఏమనుకోవాలి? సదరు వ్యక్తి పిచ్చివాడుగానీ, తాగుబోతు గానీ  అనుకోవాలి. కానీ మాననీయులైన మాజీ మంత్రి అంబటి రాంబాబు.. అలాంటి అర్థం పర్థం లేని మాటలు మాట్లాడితే ఏం అనుకోవాలి? ఆయనకు మతి స్థిమితం ఉందనుకోవాలా? లేదా? అనే సందేహం కలుగుతోంది.


తెలంగాణలో సంధ్య థియేటర్ వద్ద పుష్ప2 విడుదల నాడు జరిగిన తొక్కిసలాటలో ఒక మహిళ మరణించిన కేసుకు సంబంధించి.. అందుకు బాధ్యుడైన అల్లు అర్జున్ ను తెలంగాణ పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు. ఈ అరెస్టు సహజంగానే రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ పెను సంచలనం సృష్టించింది. అయితే ఈ ఉదంతంపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు మాజీ మంత్రి అంబటి రాంబాబు స్పందిస్తున్నారు. అల్లు అరెస్టు ఎందుకు జరిగిందనే విషయంలో ఆయన చెబుతున్న భాష్యం.. చాలా చాలా చిత్రంగా ఉంది. నిజానికి ఆయన రెండు మూడు రకాల కారణాలు చెబుతున్నారు. అవన్నీ కూడా ఒకదానికి మించి ఇంకా చిత్రమైనవి.


అల్లు అర్జున్ కొంతకాలంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి సన్నిహితంగా మెలగుతున్నారట. అందుకని చంద్రబాబునాయుడు ప్రభుత్వం ఓర్వలేక.. రేవంత్ రెడ్డి ద్వారా పావులు కదిపి ఆయనను అరెస్టు చేయించారట. మరో కారణం ఏంటంటే.. పుష్ప2 అనే సినిమా దేశవ్యాప్తంగా సూపర్ డూపర్ హిట్ అయిపోయిందంట. దానిని చూసి ఓర్వలేక రేవంత్ రెడ్డి  అరెస్టు చేయించారంట. ఇంతకంటె చిత్రమైన మరో కారణం కూడా అంబటి చెబుతున్నారు.


ఏపీలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్రవ్యాప్తంగా జిల్లా కలెక్టరు కార్యాలయాల ఎదుట రైతుల సమస్యలపై ధర్నాలు నిర్వహిస్తోంది. ఆ ధర్నాలన్నీ అద్భుతంగా సక్సెస్ అవుతున్నాయని.. వాటిమీదకు మీడియా ప్రచారం దృష్టి వెళ్లకుండా ఉండేందుకు డైవర్షన్ పాలిటిక్స్ లో భాగంగా.. చంద్రబాబునాయుడు- రేవంత్ రెడ్డితో కలిసి కుట్ర చేసి ఇదే రోజున అల్లు అర్జున్ ను అరెస్టు చేయించారని ఆయన అంటున్నారు. అంబటి రాంబాబు చేస్తున్న అతి గమనిస్తే.. ఆయన మద్యం సేవించి మాట్లాడుతున్నారా? మతి చలించి మాట్లాడుతున్నారా? అర్థం కావడం లేదని ప్రజలు అనుకుంటున్నారు. 

Related Posts

Comments

spot_img

Recent Stories