అంబటి గగ్గోలు : రామోజీపై బురద చల్లితే రివర్సు అయిందే!

రామోజీరావు అంటే విపరీతమైన ద్వేషం, కక్ష! తన తండ్రి కాలం నుంచి ప్రభుత్వంలో సాగిస్తున్న అరాచకాలపై ఎప్పటికప్పుడు పత్రిక ద్వారా ప్రశ్నిస్తున్నారనే కడుపుమంట! తండ్రి కాలంలో ఒక అస్త్రాన్ని ప్రయోగించి ఊరుకున్నారు. కానీ కొడుకు జగన్మోహన్ రెడ్డికి ఉన్న ద్వేషం ఇంకా బలమైనది. రామోజీ సారథ్యంలోని ఈనాడు పత్రికా సామ్రాజ్యాన్ని కూలదోయడానికి తాను స్వయంగా పత్రిక పెడితే.. అందులో దారుణంగా ఎదురైన వైఫల్యం ఆయనలో పట్టుదలను పెంచకపోకగా.. ద్వేషాన్ని పెంచింది. రామోజీ మీద అణువణువూ రగిలిపోయారు. వెరసి.. తాను అధికారంలోకి రాగానే.. మార్గదర్శి చిట్ ఫండ్స్ మీద అక్రమ కేసులు బనాయించి.. సీఐడీ ద్వారా ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేశారు.

రాష్ట్రంలో మార్గదర్శి సంస్థకు చెందిన ఒక్క వినియోగదారుడు కూడా ఫిర్యాదు చేయనే లేదు. మాకు అన్యాయం జరిగిందని ప్రభుత్వానికి మొర పెట్టుకోనూ లేదు. నిజానికి మార్గదర్శి తమకు రావాల్సిన డబ్బు ఎగవేసినట్టుగాగానీ, ఆలస్యం చేసినట్టుగా గానీ ఆరోపించే వినియోగదారుడు రాష్ట్రంలో ఒక్కరు కూడా లేరు. కానీ.. గత ప్రభుత్వమే కేసులు నమోదు చేసి.. రామోజీని అరెస్టు చేస్తే తప్ప.. జగన్మోహన్ రెడ్డి ఈగో చల్లారదన్నట్టుగా వ్యవహరించింది. సీఐడీ అధికారులు కూడా జగన్ కళ్లలో ఆనందం చూడడం ఒక్కటే తమ జీవితాశయం అన్నట్టుగా వ్యవహరించారు. రామోజీ అనారోగ్యంతో బెడ్ మీద ఉంటే కూడా విడిచిపెట్టకుండా ఆయనను విచారిస్తూ.. ఆ ఫోటోలను అనధికారికంగా సాక్షి మీడియాకు విడుదల చేస్తూ అనైతికంగా వ్యవహరించారు. తీరా ఆ వేధింపుల పర్వానికి తెరపడింది.

చంద్రబాబు సర్కారు వచ్చిన తర్వాత.. మార్గదర్శి చిట్ ఫండ్స్ సంస్థ మీద బనాయించిన అక్రమ కేసులు అన్నింటినీ ఉపసంహరించుకుంది. ఈ మేరకు న్యాయస్థానానికి సీఐడీ రాసిన లేఖను న్యాయవాది కోర్టుకు సమర్పించారు. అందుకు న్యాయమూర్తి అనుమతించారు.

అయితే ఈ విషయాన్ని వైఎస్సార్ కాంగ్రెస్ జీర్ణించుకోలేకపోతోంది. రామోజీరావు మీద తాము విషం కక్కాలని అనుకుంటే తమ పాచిక పారకుండాపోయిందే అని వారు క్రుద్ధులవుతున్నారు. పార్టీ తరఫున అంబటి రాంబాబు మీడియా ముందుకు వచ్చి.. ఇది రామోజీ- చంద్రబాబు కుమ్మక్కు బంధానికి నిదర్శనం అని అంటున్నారు. ప్రభుత్వం కేసు ఉపసంహరించుకోవడం వలన.. రామోజీ రావు పట్ల వైఎస్సార్, జగన్ లకు కక్ష కోపం ఉన్నాయని అందరూ అనుకునేలా చేస్తున్నారంటూ అంబటి రాంబాబు అసలు ఆవేదనను బయటపెట్టుకుంటున్నారు. నిజానికి ప్రజల మనసుల్లో ఉన్నది అదే. క్రెడిబిలిటీకి మారుపేరు అయిన రామోజీరావు విషయంలో జగన్ ప్రభుత్వం అనుసరించిన దుర్మార్గమైన పోకడలు కూడా.. ఆయన పార్టీని ప్రజలు అసహ్యించుకోవడానికి ఒక కారణం అనే సంగతి వారింకా గుర్తించడం లేదు. 

Related Posts

Comments

spot_img

Recent Stories