యూఎస్‌ లో కూలీకి అదిరిపోయే రెస్పాన్స్‌!

సూపర్ స్టార్ రజినీకాంత్, డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ కలసి చేస్తున్న క్రేజీ సినిమా కూలీ ప్రస్తుతం ఇండియా తో పాటు ఓవర్సీస్ లోనూ భారీ హైప్ క్రియేట్ చేస్తోంది. పాన్ ఇండియా స్థాయిలో ఈ సినిమాపై ప్రేక్షకుల్లో మంచి ఆసక్తి నెలకొనగా, అమెరికాలో ఇప్పటికే అడ్వాన్స్ బుకింగ్స్ జోరుగా సాగుతున్నాయి.

యూఎస్ మార్కెట్ లో ప్రీమియర్ షోలు కోసం 110కి పైగా థియేటర్లలో టికెట్లు అందుబాటులోకి వచ్చాయి. అక్కడి నుంచి వచ్చిన లేటెస్ట్ అప్‌డేట్స్ ప్రకారం ఈ మూవీ ఇప్పటికే 1 లక్ష 20 వేల డాలర్లకు పైగా గ్రాస్ సాధించింది. ఇది రజినీకాంత్ కెరీర్ కి మంచి స్టార్ట్ అని చెప్పాలి. ఈ రేంజ్ లో వసూళ్లు రావడం ద్వారా అక్కడ కూలీ సినిమాపై ఎంతగా ఆసక్తి నెలకొందో అర్థం అవుతోంది.

ఇప్పటి వరకు రజినీకాంత్ సినిమాల్లో అమెరికాలో హయ్యెస్ట్ ఓపెనింగ్స్ కలిగిన చిత్రం జైలర్. ఆ సినిమా అక్కడ సుమారు 1.5 మిలియన్ డాలర్ల వసూళ్లు ప్రీమియర్ షోలతోనే సాధించింది. ఇప్పుడు కూలీ దానికి దగ్గరగా వస్తోంది. ట్రెండ్ చూస్తే, కూలీ ఆ రికార్డును అధిగమించే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి.

ఈ సినిమా కోసం మరో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది మ్యూజిక్. అనిరుద్ అందిస్తున్న సంగీతం ఇప్పటికే మంచి హైప్ తెచ్చుకుంది. తమిళనాడులో రజినీకాంత్ సినిమాలకు అనిరుద్ సంగీతం ఒక ప్రత్యేక శక్తిగా మారింది. మన తెలుగు ప్రేక్షకుల్లో బాలయ్య సినిమాలకు థమన్ మ్యూజిక్ ఏ విధంగా వర్కౌట్ అవుతుందో, ఇక్కడ అనిరుద్ మ్యూజిక్ కూడా అలాంటి ఫీలింగ్ తీసుకొస్తోంది. కూలీ పాటలు, బీజీఎం మొదలుకొని అన్నింటిపైనా అనిరుద్ స్టైల్ స్పష్టంగా కనిపిస్తోంది.

ఇలా చూస్తే, కూలీ సినిమా కేవలం స్టార్డమ్ మీద కాకుండా, కథ, మ్యూజిక్, డైరెక్షన్ వంటి అన్ని కోణాల్లోనూ సాలిడ్ రిస్పాన్స్ అందుకుంటోంది. త్వరలో థియేటర్లలో విడుదల కానున్న ఈ సినిమా ఎంత స్థాయిలో వసూళ్లు సాధిస్తుందో చూడాలి. కానీ మొదటి అడుగు మాత్రం భారీగా పడింది అనడంలో సందేహం లేదు.

Related Posts

Comments

spot_img

Recent Stories