నటి అమలాపాల్ తల్లిగా ప్రమోషన్ అందుకుంది. అమలా భర్త జగత్ దేశాయ్ ఇన్ స్టా లో షేర్ చేసిన వీడియో ద్వారా బాబు పుట్టిన విషయాన్ని ప్రకటించారు. అందులో జగత్ జూన్ 11న బాబు పుట్టినట్టు తెలిపాడు. జగత్ అమలా పాల్ బాబుతో కలిసి ఇంట్లోకి అడుగుపెట్టిన వీడియోను షేర్ చేశారు. “ఇట్స్ ఎ బాయ్!!, మీట్ అవర్ లిటిల్ మిరాకిల్, ఇలై” అనే క్యాప్షన్‌తో వీడియో షేర్ చేశారు.
ఈ విషయం గురించి తెలుసుకున్న అభిమానులు, సినీ ప్రముఖులు చాలా మంది వారికి శుభాకాంక్షలు చెబుతున్నారు. బాబు పుట్టి వారం రోజులు అవుతున్నప్పటికీ అమలా జగత్ ఇద్దరు కూడా ఈ విషయాన్ని సర్‌ప్రైజ్ గా ఉంచారు.
తల్లి బిడ్డ ఇంటికి వచ్చిన క్షణంలో సిద్ధం చేసిన వీడియోను జగత్ ఇప్పుడు షేర్ చేశారు. ఈ క్రమంలోనే బాబు పేరు కూడా బయటపెట్టాడు జగత్. బాబుకు ఇలై అని పేరు పెట్టారు. గతేడాది నవంబర్‌లో అమల, జగత్ పెళ్లి చేసుకున్నారు. కొచ్చిలో జరిగిన వివాహ వేడుకకు దగ్గరి బంధువులు మాత్రమే హాజరయ్యారు.