నాని ఒక్కడేనా.. చాలామందిని టార్గెట్ చేశారా?

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు రాష్ట్రవ్యాప్తంగా అసహనంతో  రగలిపోతున్న వాతావరణం కనిపిస్తూనే ఉంది. రాష్ట్రంలో మెజారిటీ అభ్యర్థులకు తమ ఓటమి ఖరారు అయింది. సొంతంగా చేయించుకున్న సర్వేలు, పోలింగ్ సరైన తర్వాత సొంతంగా సాగించిన అధ్యయనాలలో తమ ఓటమి వారికి స్పష్టంగా తెలిసిపోయింది. అందువల్ల వారంతా అసహనంతో పేట్రేగిపోతుండడం సహజం. అయితే తమాషా ఏమిటంటే ఎమ్మెల్యేలుగా గెలిచే అవకాశం ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు కూడా.. విపరీతమైన ఫ్రస్టేషన్ తో రగిలిపోతున్నారట.  ఇన్ని కోట్లు ఖర్చుపెట్టి తాము నెగ్గితే పార్టీ అధికారంలోకి రాకపోతే ఏం చేసుకోవాలి. పెట్టిన పెట్టుబడి మొత్తం బూడిదలో పోసిన పన్నీరే కదా అనేది వారి అసహనానికి కారణం.

ఈ నేపథ్యంలో చంద్రగిరిలో తెలుగుదేశం పార్టీ తరఫున ఎమ్మెల్యే అభ్యర్థి పులివర్తి నాని మీద జరిగిన దాడి.. తదనంతర పర్యవసానాలు కీలకంగా గమనించాలి. ఆసుపత్రి నుంచి డిశ్చార్జి అయిన తర్వాత నా అని చెప్పిన మాటను పరిగణనలోకి తీసుకోవాలి. ‘‘చంపేయండి రా.. బై ఎలక్షన్స్ వస్తాయి’’ అని తనపై దాడి చేసిన వారిలో ఎవరో అన్నట్లుగా తన గన్ మెన్ తో పాటు,  మరికొందరు తనతో చెప్పారని పులివర్తి నాని మీడియాకు వెల్లడించారు. అంటే వారు ఓడిపోతారని వారికి అర్థం అయిపోయిందని, తనను చంపేయడం ద్వారా బై ఎలక్షన్ కి వెళ్లాలనుకుంటున్నారని పులివర్తి నాని చెప్పుకొస్తున్నారు.

ఇప్పుడు ప్రజలలో కలుగుతున్న సందేహం ఏంటంటే.. గెలిచే అవకాశం ఉన్న తెలుగుదేశం మరియు కూటమి పార్టీల అభ్యర్థులను ఇలా అంతమొందించేస్తే ఉప ఎన్నికలు వస్తాయని అప్పుడు ఇంకాస్త జాగ్రత్తగా ప్లాన్ చేసుకొని పోలింగుకు అసలు ప్రజలే రాకుండా భయభ్రాంతులకు గురి చేయడం ద్వారా తాము ఈసారి కచ్చితంగా నెగ్గగలమనే ఆశ రాష్ట్రంలో ఇంకా ఎంతమంది వైసీపీ అభ్యర్థులలో ఉన్నదో కదా అని అనుమానం కలుగుతుంది. ఫలితాలు వెల్లడయ్యేవరకు ఈ 20 రోజులు మాత్రమే కాదు ఆ తర్వాత ఎమ్మెల్యేలు గెలిచిన సరే తెలుగుదేశం అభ్యర్థుల ప్రాణాలు గాలిలో దీపాలుగా మారిపోతాయా అనే భయం ప్రజలలో కలుగుతుంది.

పులివర్తి నాని ఒక్కరే కాదని, రాష్ట్రంలో ఇంకా అనేకమంది తెలుగుదేశం ఎమ్మెల్యే అభ్యర్థులను వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన వాళ్లు టార్గెట్ చేసినట్టుగా ఉన్నదని ప్రజలు అనుకుంటున్నారు. వేరువేరు ప్రాంతాలలో జరుగుతున్న  సంఘటనలు కూడా ఇలాంటి అభిప్రాయాన్ని కలిగిస్తున్నాయి. ముందు ముందు ఏం జరుగుతుందో వేచి చూడాలి.

Related Posts

Comments

spot_img

Recent Stories