లిక్కర్ పాలసీకా తోడుగా.. జగన్ పన్నుల మాయాజాలం!

వైఎస్ జగన్మోహన్ రెడ్డి.. 2019లో అధికారంలోకి రాకముందునుంచీ ఆయనలో మద్యం అమ్మకాల ద్వారా .. ఏ రకంగా వేల కోట్లు దోచుకోవచ్చు ననే విషయంలో స్పష్టమైన అవగాహన ఉంది. అధికారంలోకి రాగానే.. మద్యం విధానం మార్చేసి డిస్టిలరీలనుంచి దోచుకోదలచని పద్ధతి మీద ఆయనవద్ద ఎన్నికలకు ముందే వ్యూహం ఉంది. దానిని దృష్టిలో ఉంచుకునే.. ఆయన సంపూర్ణ మద్య నిషేధం అనే బూటకపు హామీతో ఎన్నికలప్రచారంలో మహిళలను బుట్టలోపెట్టారు. అధికారంలోకి వచ్చిన తర్వాత.. ‘కేవలం నిషేధం దిశగా అడుగులు వేయడం కోసమే’ అనే మాయమాటలతో కొత్త విధానం తీసుకువచ్చారు. ప్రభుత్వ ఆధ్వర్యంలో మద్యం దుకాణాలు అన్నారు. దాని వలన విక్రయాలు తగ్గుతాయని అన్నారు. పన్నుల్లో మాయాజాలం చేశారు.

వ్యసనపరులతో మద్యం అలవాటు మాన్పించడానికే షాక్ కొట్టేలా రేట్లు పెడతానంటూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి.. అధికారంలోకి వచ్చిన తర్వాత అనూహ్యంగా పన్నులు పెంచారు. ఆ దెబ్బకు మద్యం విక్రయాలు బాగా పడిపోయాయి. అప్పటికే డిస్టిలరీ నుంచి వసూళ్ల పర్వం మొదలైంది. కానీ అధిక పన్నుల కారణంగా విక్రయాలు పడిపోవడంతో.. డిస్టిలరీల నుంచి జగన్ దళాలకు అందే ముడుపులు కూడా తగ్గాయి. జగన్ దీంతో షాక్ అయ్యారు. తన దందా కూడా పడిపోతుందని ఆయన ఊహించలేదు.

అంతే మద్యంపై పన్నుల విషయంలో మడమ తిప్పారు. తన దందాను పదిలంగా కాపాడుకోవడానికి.. మద్యంపై పన్నులను మళ్లీ తగ్గించారు. అమ్మకాలు పుంజుకున్నాయి. డిస్టిలరీలకు అమ్మకాలు పెరిగాయి. ఆటోమేటిగ్గా జగన్ దందా కూడా పెరిగింది. జగన్ దళాలకు డిస్టిలరీలనుంచి దక్కే వాటాలు పెరిగాయి.
ఈ విషయాలన్నింటినీ లిక్కర్ స్కామ్ ను దర్యాప్తు చేస్తున్న సిట్ తమ ప్రిలిమినరీ చార్జిషీటు లో స్పష్టంగా పేర్కొంది. ఇందుకు సంబంధించిన ఆధారాలన్నీ కూడా అందులో దఖలు పరచింది.
ఈ బాగోతం గమనిస్తే.. జనం పట్ల జగన్ కు ఉన్న శ్రద్ధ, చిత్తశుద్ధి, ప్రేమ ఎలాంటివో ఎవ్వరికైనా సరే చాలా సులువుగా అర్థమవుతుంది. తాను తలచినంత భారీగా దోచుకోవడం ఒక్కటే ఆయన లక్ష్యం. అందుకోసం పన్నులు పెంచేసి, ప్రజల అలవాటు మాన్పించడానికే పెంచానని మాయ చేస్తారు. తన దోపిడీ సరిగా సాగడం లేదనిపిస్తే.. అమాంతం పన్నులు తగ్తించేసి ప్రజలు ఎలా చచ్చినా పర్లేదు.. మద్యం అమ్మకాలు పెరిగితే చాలు అనే నిర్ణయానికి వస్తారు.

ఈ బాగోతం మొత్తం చూసి.. ఇలాంటి ప్రజాకంటకుడైన నేతనేనా మనం ముఖ్యమంత్రిగా ఎన్నుకున్నది అని ప్రజలు నివ్వెరపోతున్నారు. ప్రజారోగ్యం పట్ల కనీసమాత్రపు పట్టింపు లేకుండా.. ఆడుకున్న జగన్మోహన్ రెడ్డి దుర్మార్గపు పద్ధతులను అందరూ అసహ్యించుకుంటున్నారు.

Related Posts

Comments

spot_img

Recent Stories