అల్లు అర్జున్ కజిన్ ‘గిల్ట్’ టైటిల్ పోస్టర్ విడుదల!

టాలీవుడ్‌లో ప్రస్తుతం డిఫరెంట్ కంటెంట్ బేస్డ్ చిత్రాలను ఆడియెన్స్ ఎక్కువగా ఆదరిస్తున్న సంగతి తెలిసిందే. రెగ్యులర్ కమర్షియల్ సినిమాల కంటే కాస్త భిన్నమైన కాన్సెప్ట్‌లే బాక్సాఫీస్ వద్ద ఎక్కువగా సక్సెస్ అవుతున్న సంగతి కూడా తెలిసిందే. ఈ క్రమంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కజిన్ విరాన్ ముత్తంశెట్టి హీరోగా ఓ కొత్త సినిమా అభిమానుల ముందుకు రాబోతుంది.

ఇప్పటికే విరాన్ ముత్తంశెట్టి పలు సినిమాల్లో నటించి ఆడియెన్స్‌ను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. రీసెంట్‌గా ‘పురుషోత్తముడు’ చిత్రంతో తన నటనతో అందర్ని మెప్పించిన సంగతి తెలిసిందే. విరాన్ ముత్తం శెట్టి హీరోగా రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో తెరకెక్కనున్న ఈ మూవీ యూత్‌ఫుల్ లవ్ స్టోరీతో పాటుగా క్రైమ్, యాక్షన్, థ్రిల్లర్‌గా ఉండబోతోందని మేకర్స్ తెలియజేస్తున్నారు. శ్రీ కమలహాసిని మూవీ మేకర్స్ బ్యానర్‌పై లక్ష్మీ సునీల, డా.పార్థసారథి రెడ్డి, ఎ.శివ కుమార్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి చలపతి పువ్వల డైరెక్టర్‌ గా ఉన్నారు.

ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించి ఇంట్రెస్టింగ్ టైటిల్‌ను ప్రేక్షకుల ముందుకు తీసుకుని వచ్చారు. ‘గిల్ట్’ అనే టైటిల్‌తో ఈ సినిమా రాబోతోంది. ఈ మేరకు విడుదల చేసిన టైటిల్ పోస్టర్ అందరినీ ఆకట్టుకునేలా ఉంది. టైటిల్‌తోనే సినిమా మీద అందరి దృష్టి పడేలా మూవీ మేకర్స్‌ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తుంది. ఈ సినిమాకు మహావీర్ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని అప్డేట్స్ రాబోయే రోజుల్లో వెల్లడిస్తామని చిత్ర బృందం తెలిపింది.

Related Posts

Comments

spot_img

Recent Stories