బన్నీ-అట్లీ మూవీ లొకేషన్‌ ఎక్కడో తెలుసా!

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం తమిళ దర్శకుడు అట్లీతో కలిసి చేస్తున్న కొత్త సినిమా AA22xA6పై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమాను పాన్ వరల్డ్ స్థాయిలో, ఇప్పటివరకు చూసిన బడ్జెట్ కంటే ఎక్కువ ఖర్చుతో రూపొందిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ వేగంగా జరుగుతుండగా, టీమ్ ప్రపంచవ్యాప్తంగా వేర్వేరు దేశాల్లో చిత్రీకరణ కోసం సన్నాహాలు చేస్తోంది.

ఇటీవల ఈ సినిమా కోసం సరైన లొకేషన్లను ఫైనల్ చేయడానికి దర్శకుడు అట్లీ రికీ చేస్తున్నాడు. అందులో భాగంగా ఆయన సౌదీ అరేబియాకు వెళ్లి అబుదాబి సమీపంలోని లివా ఎడారులను పరిశీలించారు. అక్కడి వాతావరణం, సహజసిద్ధమైన అందాలు ఈ చిత్రానికి తగ్గట్టు ఉన్నాయా అన్నది ఆయన స్వయంగా చూసుకున్నారు. ఈ విషయం గురించి అట్లీ తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో షేర్ చేయడంతో అభిమానుల్లో మరింత ఆసక్తి పెరిగింది.

Related Posts

Comments

spot_img

Recent Stories