ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ క్రేజ్ ఇపుడు పాన్ ఇండియా లెవెల్లో ఏ రేంజ్ లో ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. తాను నటించిన లేటెస్ట్ భారీ హిట్ చిత్రం “పుష్ప 2” తో రీసౌండింగ్ హిట్ అందుకున్న అల్లు అర్జున్ నెక్స్ట్ సినిమాలపై మరిన్ని అంచనాలు నెలకొన్నాయి. అయితే ఈ సినిమాల్లో పుష్ప 2 తర్వాత మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ తో సినిమా తాను చేయాల్సి ఉన్న సంగతి తెలిసిందే.
కానీ ఇపుడు ఓ ట్విస్ట్ చోటు చేసుకున్నట్టుగా టాక్ వినిపిస్తుంది. దీని ప్రకారం త్రివిక్రమ్ ప్రాజెక్ట్ కంటే ముందే ఒక క్విక్ పాన్ ఇండియా భారీ ప్రాజెక్ట్ ని బన్నీ చేయనున్నట్టుగా తెలుస్తుంది. కోలీవుడ్ టాలెంటెడ్ యువ దర్శకుడు అట్లీతో సినిమా కోసం ఎప్పుడు నుంచో టాక్ ఉంది. మరి ఈ కలయికలో సినిమానే ఇపుడు మొదలు కానున్నట్టుగా తెలుస్తుంది. ఈ సినిమా తర్వాత త్రివిక్రమ్ సినిమా ఉంటుందట. మరి దీనిపై అధికారిక క్లారిటీ ఇంకా రావాల్సి ఉంది.