తమ్ముడికి అన్నల శుభాకాంక్షలు!

నందమూరి నట సింహం మోక్షజ్ఞ టాలీవుడ్ లో హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్న సంగతి తెలిసిందే. ఈ రోజు మోక్షు పుట్టిన రోజు కానుకగా డెబ్యూ మూవీకి సంబంధించి ఫస్ట్ లుక్ ని మూవీ మేకర్స్‌ అభిమానుల ముందుకు తీసుకుని వచ్చారు. హనుమాన్ వంటి సూపర్‌ హిట్ చిత్రాన్ని తెరకెక్కించిన ప్రశాంత్ వర్మ డైరెక్షన్ లో  మోక్షు మొదటి సినిమా రాబోతుంది. కాసేపటి క్రితం విడుదలైన మోక్షు ఫస్ట్ లుక్ కు అదిరిపోయే రెస్పాన్స్ కనపడుతుంది.

ఈ సినిమాను SLV, LEGEND ప్రొడక్షన్స్ బ్యానర్ పై సుధాకర్ చెరుకూరి, తేజస్విని మతుకుమిల్లి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. కాగా మోక్షు టాలీవుడ్ ఎంట్రీ సందర్భంగా యంగ్ టైగర్ ఎన్టీఆర్‌ తన వ్యక్తిగత సోషల్‌ మీడియా ఖాతాలో ” నువ్వు సినిమా ప్రపంచంలోకి ప్రవేశించినందుకు చాలా సంతోషంగా ఉంది. నీ జీవితంలో ప్రాంభించబోయే కొత్త అధ్యాయానికి తాతయ్య నందమూరి తారక రామారావు ఆశీస్సులతో పాటు ఆ భగవంతుడిఆశీర్వాదాలు నీకు సదా ఉండాలని కోరుకుంటూ జన్మదిన శుభాకాంక్షలు మోక్షూ” అంటూ తమ్మడు మోక్షజ్ఞకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపాడు తారక్.

తారక్ తో పాటు నందమూరి కళ్యాణ్ రామ్ ” సినిమా ప్రపంచానికి స్వాగతం మోక్షు, తాతగారి ప్రతిష్ఠ నిలబెట్టే ఎత్తుకు నువ్వు ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను, పుట్టిన రోజు శుభాకాంక్షలు మోక్షజ్ఞ” అంటూ కల్యాణ్‌ రామ్‌ తన ట్వీట్‌ లో రాసుకొచ్చాడు. ఈ ట్వీట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. మోక్షజ్ఞ ఎంట్రీతో ఫుల్ జోష్ లో ఉన్న నందమూరి ఫ్యాన్స్ కు నందమూరి బ్రదర్స్ శుభాకాంక్షల తో ఆ ఆనందం మరింత రెట్టింపు అయింది.

Related Posts

Comments

spot_img

Recent Stories