యంగ్ టైగర్ ఎన్టీఆర్, బాలీవుడ్ స్టైలిష్ స్టార్ హృతిక్ రోషన్ కలిసి నటిస్తున్న భారీ యాక్షన్ మూవీ వార్ 2 మీద సినిమా అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఈ చిత్రాన్ని బ్రహ్మాండంగా తెరకెక్కిస్తున్న దర్శకుడు అయాన్ ముఖర్జీ మాత్రం ఇప్పటివరకు ఫస్ట్ లుక్ పోస్ట్ చేయలేదు, రిలీజ్ డేట్ మాత్రం బయటకు వచ్చింది.
కానీ తాజా సమాచారం ప్రకారం, మేకర్స్ ఇక డైరెక్ట్ గా టీజర్ ను రిలీజ్ చేయాలనే ప్లాన్ లో ఉన్నారని ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తుంది. ఈ టీజర్ మే నెలలో వస్తుందంటూ బజ్ గట్టిగా వినిపిస్తోంది. ఒకవేళ వస్తే అది ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా రిలీజ్ కావొచ్చని లేక మే నెలాఖరులోకి వాయిదా పడొచ్చని అభిప్రాయం వ్యక్తమవుతోంది.
ఈ సినిమాను యష్ రాజ్ ఫిల్మ్స్ నిర్మిస్తుండగా, ఇది వారి స్పై యూనివర్స్ లో భాగంగా రూపొందుతోంది. గతంలో వచ్చిన పఠాన్, టైగర్ సినిమాల్లాగే ఇది కూడా భారీ స్థాయిలో తెరకెక్కుతోంది. ఇక ఈ బిగ్ బడ్జెట్ మూవీని ఆగస్ట్ 14న గ్రాండ్‌గా థియేటర్లలోకి తీసుకురావాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.