ఎంతచెడ్డా జగన్మోహన్ రెడ్డి రూటు సెపరేటు. ఆయన ఎదుటివాళ్ళ ఎలాంటి నిందలు వేస్తారో.. సరిగ్గా తను అలాంటి పనులే చేస్తున్నారు. ఎన్నికలకు ముందు.. చంద్రబాబును, పవన్ కళ్యాణ్ లను ఉద్దేశించి జగన్ ఒక విమర్శ చాలా తీవ్ర స్థాయిలో చేస్తుండేవారు. ఈ ఇద్దరు నాయకులకు రాజధానిలో ఇళ్లు లేవని.. వీళ్లను గెలిపిస్తే ఇక్కడ ఉండి రాజకీయం చేస్తారు తప్ప ఓడిపోతే హైదరాబాదుకు పారిపోతారని అంటుండే వాళ్ళు. కానీ ఇప్పుడు జరుగుతున్నది ఏమిటి? అచ్చంగా రివర్స్ జరుగుతోంది.
ఎన్నికల్లో ప్రజలు తనను అత్యంత నీచంగా ఓడించిన తరువాత.. జగన్ ఇంచుమించుగా బెంగళూరులోని యలహంక ప్యాలెస్ కి పరిమితం అయిపోయారు. పార్టీ నిర్వహణ పరంగా, వ్యక్తిగతంగా కూడా ఆయన ఆపరేషన్స్ అన్నీ అక్కడినుంచే నడిచిపోతున్నాయి. జిల్లాల యాత్ర అనే ప్రతిపాదన ఎటూ అటకెక్కి పోయింది. ఎక్కడికైనా పరమర్శలకు వెళ్ళినా కూడా..ముందురోజు బెంగళూరు నుంచి రావడం.. పని పూర్తి చేసుకుని వెళ్లిపోవడం జరుగుతోంది. చివరకు జగన్ రాజకీయ జీవితానికి మూలపురుషుడు అయిన వైయస్ రాజశేఖర్ రెడ్డి జయంతిని కూడా అంతే మొక్కుబడిగా నిర్వహిస్తున్నారు.
ఏడో తేదీ సాయంత్రం 5 గంటలకు బెంగళూరు నుంచి పులివెందుల చేరుకుని అక్కడి నివాసంలో రాత్రికి బసచేస్తారు జగన్.
మంగళవారం ఉదయం పులివెందుల నుంచి బయలుదేరి గంటలకు ఇడుపులపాయ చేరుకుంటారు. అక్కడ దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి ఘాట్లో ఆయన జయంతి సందర్భంగా నిర్వహించనున్న ప్రత్యేక ప్రార్ధనల్లో పాల్గొంటారు. కార్యక్రమం అనంతరం పులివెందుల చేరుకుని క్యాంప్ కార్యాలయంలో స్ధానిక ప్రజలకు అందుబాటులో ఉంటారు. సాయంత్రం అక్కడి నుంచి తిరుగుపయనమవుతారు. అంటే తిరిగి బెంగళూరు వెళ్ళిపోతారన్నమాట.
బుధవారం మళ్లీ బెంగళూరు నుంచి హెలికాప్టర్లో రైతులను పరామర్శించాడానికి.. హెలికాప్టర్ లో వెళతారు.అంటే మొత్తంగా బెంగుళూరులోనే ఉంటున్నారన్నమాట. తనేదో కన్నడ రాష్ట్రంలో వ్యక్తి అయినట్టుగా ఆయన వ్యవహార సరళి ఉన్నదనే విమర్శ వినిపిస్తోంది. తండ్రి జయంతి సందర్భంగా కూడా టైం ఇవ్వలేనంత బిజీగా జగన్ ఉన్నారా అనే చర్చ వస్తోంది.