ఆశలన్నీ తారక్ మీదే! బాలీవుడ్‌లో సూపర్ సక్సెస్‌ఫుల్ బ్యూటీగా తనకంటూ ప్రత్యేక ఇమేజ్‌ను క్రియేట్ చేసుకుంది అందాల ముద్దుగుమ్మ కియారా అద్వానీ. ఈ బ్యూటీ టాలీవుడ్‌లోనూ పలు సినిమాలు చేస్తూ ముందుకు దూసుకుపోతుంది. ఇప్పటికే మహేష్ బాబు, రామ్ చరణ్ సరసన హీరోయిన్‌గా నటించిన ఈ ముద్దుగుమ్మ తాజాగా ‘గేమ్ ఛేంజర్’ మూవీతో ప్రేక్షకులను అలరించింది.
అయితే, ఈ సినిమా అనుకున్న స్థాయిలో విజయాన్ని అందుకోలేకపోవడంతో కియారా మరోసారి టాలీవుడ్ ప్రేక్షకుల్లో హిట్ కొట్టలేకపోయింది. దీంతో అమ్మడు తన నెక్స్ట్ మూవీపైనే తన ఆశలన్ని పెట్టుకుంది. అలా అని, కియారా నటించే నెక్స్ట్ మూవీ స్ట్రెయిట్ తెలుగు సినిమా కాదు. బాలీవుడ్‌లో తెరకెక్కుతున్న ‘వార్-2’ మూవీలో మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ యాక్ట్ చేస్తుండడంతో ఈ సినిమాతోనైనా కియారా మరోసారి టాలీవుడ్ ప్రేక్షకులకు దగ్గరయ్యేందుకు ప్రయత్నిస్తోంది. మరి ఈ సినిమాతోనైనా కియారా ఆశ నెరవేరుతుందా అనేది చూడాల్సిందే.