పవన్ కళ్యాణ్ నటిస్తున్న భారీ చిత్రాల్లో హరిహర వీరమల్లు ఒకటి. ఈ సినిమాలో నిధి అగర్వాల్ హీరోయిన్‌గా నటిస్తుండగా, జ్యోతి కృష్ణ దర్శకత్వం వహిస్తున్నారు. ఎంతో కాలంగా తెరకెక్కుతున్న ఈ ప్రాజెక్ట్‌కు అనేక అడ్డంకులు ఎదురవుతూ వచ్చాయి.
తొలుత షూటింగ్ పరంగా వాయిదాలు పడుతూ వచ్చిన ఈ సినిమా చివరికి పూర్తవడంతో, ఇక రిలీజ్ దశకి చేరుతుందనుకున్నారు అభిమానులు. కానీ, అనుకోని కారణాలతో విడుదల కూడా మరింత ఆలస్యం అవుతోంది. సినిమా మొత్తం కంప్లీట్ అయినప్పటికీ రిలీజ్ విషయంలో ఇంకా స్పష్టత రాలేదు.
ఇప్పుడు సమయం గడుస్తున్న కొద్ది పవన్ అభిమానుల్లో కుతూహలం పెరుగుతోంది. మళ్ళీ ఎప్పుడైనా కొత్త రిలీజ్ డేట్ ప్రకటిస్తారా అనే ఆసక్తితో ఎదురుచూస్తున్నారు.
ఈ పరిస్థితుల్లో సినిమా నిర్మాతల నుంచి ఏమైనా అధికారిక ప్రకటన వస్తుందా లేదా అనేది చూడాలి. మరి ఈసారి హరిహర వీరమల్లు ఎప్పటికి థియేటర్లలోకి వస్తాడో అన్నది వేచి చూడాల్సిందే.