పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా, యంగ్ డైరెక్టర్ సుజీత్ తెరకెక్కించిన యాక్షన్ ఎంటర్టైనర్ “ఓజీ”పై అభిమానుల్లో ఊహించని క్రేజ్ నెలకొంది. రిలీజ్‌కు ముందే ఈ సినిమా చుట్టూ ఏర్పడిన అంచనాలు అంతలా పెరిగిపోయాయి కాబట్టి ప్రీమియర్స్ దగ్గరే ఇండియన్ సినీ చరిత్రలో కొత్త రికార్డులు సెట్ చేసింది.
థియేటర్లలోకి వచ్చిన మొదటి రోజే ఈ సినిమాకి ఏ స్థాయిలో వసూళ్లు వస్తాయో అన్న ఆసక్తి ప్రేక్షకుల్లో కనిపిస్తోంది. సాధారణంగా పవన్ సినిమాల కలెక్షన్లపై అధికారిక వివరాలు బయటికి రావు. ఎక్కువగా ఫ్యాన్స్, ట్రేడ్ వర్గాల లెక్కలే సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంటాయి. కానీ ఈ సారి మాత్రం నిజమైన నెంబర్స్‌ను మేకర్స్ ప్రకటిస్తారా అన్న ఉత్కంఠ కొనసాగుతోంది.
అధికారిక అప్డేట్స్ రాకపోయినా అనధికారిక అంచనాలు మాత్రం అలరిస్తున్నాయి. ఓజీ మొదటి రోజే 100 కోట్ల మార్క్‌ను దాటుతుందని, అంతకంటే ఎక్కువగా 150 కోట్ల వరకు చేరే అవకాశం ఉందని ట్రేడ్ సర్కిల్స్‌లో చర్చ నడుస్తోంది. మొత్తానికి పవన్ కెరీర్లోనే కాకుండా ఇండియన్ సినిమా రేంజ్లో కూడా ఈ సినిమా వసూళ్లు కొత్త బెంచ్‌మార్క్ సెట్ చేసే అవకాశం ఉందని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.