ముడుపులన్నీ బంగారంగా : వాటే ఐడియా జగన్‌జీ!

మూడున్నర వేల కోట్ల రూపాయలకు పైగా ఖజానాకు నష్టంచేసి వైసీపీ పెద్దలు సొమ్ములు కాజేసిన మద్యం కుంభకోణంలో ఏ1 నిందితుడు కెసిరెడ్డి రాజశేఖర రెడ్డిని పోలీసులు వ్యూహాత్మకంగా అరెస్టుచేసి విచారించిన తొలిరోజున ఏం చెప్పారో రిమాండు రిపోర్టు ద్వారా తెలుసుకుని రాష్ట్రం నిర్ఘాంతపోయింది. పార్టీకి మళ్లీ మళ్లీ ఎన్నికల్లో పోటీచేయడానికి భారీ ఎత్తున ఫండ్ కావాలని.. అలా ఫండ్ సమకూరేలా కొత్త మద్యం పాలసీని డిజైన్ చేయాలని జగన్మోహన్ రెడ్డి.. ప్రారంభంలోనే దిశానిర్దేశం చేసినట్టుగా ఆ రిపోర్టులో పేర్కొన్నారు. ఆ రకంగా జగన్ ఆదేశాల మేరకు ఒక్కో నెలకు 50-60 కోట్ల రూపాయలు ముడుపులుగా కాజేయడానికి ఆయన అనుచర దళాలు పాలసీ సిద్ధం చేశాయి. అయితే అంతంత పెద్దమొత్తాలను నగదుగా వసూలు చేసుకోవడం ఎలాగ? అనే విషయంలో  వారు మాఫియా ముఠాల కంటె సరికొత్త ఆలోచనలు చేశారు. దేశంలో అనేక రాష్ట్రాల్లో మద్యం పాలసీల రూపేణా కుంభకోణాలు జరిగినా ఎవ్వరికీ రాని ఆలోచన జగన్ దళాల వారు ఆచరణలో పెట్టారు. ముడుపులుగా స్వీకరించే సొమ్మును బంగారం రూపంలో తీసుకున్నారు.

దీనివల్ల చేతికి మట్టి అంటకుండా ముడుపులు తీసుకోవడం ఒక్కటే కాదు. 2019 నాటినుంచి ఇప్పటిదాకా తీసుకున్న బంగారం ముడుపుల విలువ కూడా కనీసం రెండు నుంచి మూడు రెట్లు పెరిగిపోయిందని అంచనా. సాధారణంగా కోట్లకు కోట్ల రూపాయల ముడుపులు కాజేసే అవినీతి పరులు డబ్బుకట్టలను తమ ఇళ్లలో భద్రంగా బీరువాల్లోనూ, బాత్రూం గోడల్లోనూ దాచుకుంటారని మనం వార్తల్లో చదువుతూ ఉంటాం. కానీ జగన్మోహన్ రెడ్డి.. లిక్కర్ స్కామ్ ముఠాలోని వారంతా అపరిమిత మేధావులు కాబట్టి.. ఇలా బంగారం రూపంలోకి తీసుకునే సమయంలోనే ముడుపుల రూపం మార్చారు. అందుకే ఇప్పుడు సిట్ విచారణ నేపథ్యంలో ఈ తరహా దోపిడీ గురించి తెలుసుకుంటున్న ప్రజలు ‘వాటేన్ ఐడియా జగన్ జీ’ అనుకుంటూ ముక్కున వేలేసుకుంటున్నారు.
జగన్ అమలుచేసిన సరికొత్త లిక్కర్ పాలసీ వల్ల దాదాపు మూడున్నర వేల కోట్లరూపాయలు వైసీపీ పెద్దలు కాజేసినట్టుగా లెక్కతేలిన సంగతి అందరికీ తెలుసు. ఇంతపెద్దమొత్తంలో దాదాపు 400 కోట్ల విలువ వరకు బంగారం రూపంలోనే తీసుకున్నట్టుగా విచారణలో గుర్తించారు. ఇది జగన్ దళాల దోపిడీ నెట్ వర్క్ యొక్క మాస్టర్ ప్లాన్ గా పోలీసులు భావిస్తున్నారు.

ఇలాంటి దోపిడీ పర్వంలో ఒక బ్రాండు బ్రాందీని సరఫరా చేసే ముంబాయికి చెందిన ఒక్క తిలక్ నగర్ ఇండస్ట్రీస్ నుంచే ఒక్కో కేసుకు 20 శాతం వంతున మొత్తం 260 కోట్లు ముడుపులు తీసుకున్నట్టుగా సిట్ నిర్ధరించింది. ఈ మొత్తం ముడుపులో 196 కోట్ల విలువైన బంగారమే తీసుకున్నట్టుగా కూడా తేల్చారు. అందుకే జగన్ ముఠా తెలివితేటలకు దర్యాప్తు అధికారులే విస్తుపోతున్నారు.

Related Posts

Comments

spot_img

Recent Stories