ఆ మూవీతో రాబోతున్న ఆలియా!

బాలీవుడ్ టాప్ హీరోయిన్లలో ఆలియా భట్ పేరు ఎప్పుడూ ముందుంటుంది. ఆర్ఆర్ఆర్ వంటి భారీ హిట్‌తో సౌత్ ఆడియెన్స్‌ను కూడా ఆకట్టుకున్న ఆమె, రణ్‌బీర్ కపూర్‌తో వివాహం తర్వాత మరింత జాగ్రత్తగా సినిమాలు ఎంచుకుంటూ వస్తోంది. ఇప్పటివరకు ఎంచుకున్న ప్రాజెక్టులన్నీ విభిన్నంగా ఉండగా, ఇప్పుడు మరో కొత్త ప్రయోగానికి సిద్ధమవుతోంది.

తాజా సమాచారం ప్రకారం, ఆలియా ఈసారి నటిగా కాకుండా నిర్మాతగా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. పెద్దల కంటెంట్ ఆధారంగా ఉండే ఒక సినిమాను తన సొంత బ్యానర్ ఎటర్నల్ సన్‌షైన్ పిక్చర్స్‌ ద్వారా నిర్మించాలనే ప్లాన్‌లో ఉందట. ఈ ప్రాజెక్ట్‌తో శ్రీతి ముఖర్జీ అనే కొత్త దర్శకురాలికి అవకాశం ఇవ్వబోతుందని టాక్ వినిపిస్తోంది.

సినిమా కథ కాలేజ్ వాతావరణం, యువత భావాలు, సంబంధాలపై తిరుగుతుందని తెలుస్తోంది. కొత్త ముఖాలతో తెరకెక్కనున్న ఈ చిత్రానికి సంబంధించిన పూర్తి వివరాలు త్వరలోనే బయటకు రానున్నాయని బీ టౌన్‌లో చర్చ సాగుతోంది.

Related Posts

Comments

spot_img

Recent Stories