అలసితివా ఆత్రేయ..!

నేచురల్ స్టార్‌ నాని హీరోగా వివేక్‌ ఆత్రే డైరెక్షన్‌ లో రూపుదిద్దుకున్న సినిమా సరిపోదా శనివారం.ఆ సినిమా గురువారం విడుదలై ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఎస్జే సూర్య విలన్ గా నటించిన ఈ సినిమాని చిత్ర బృందం ముందు నుంచి కూడా భిన్నంగా ప్రమోట్ చేస్తూ వచ్చింది  సినిమా కథ లైన్ లీక్ చేసి వివేక్ ఆత్రేయ స్క్రీన్ ప్లే కోసం సినిమాకి రావాలంటూ పెద్ద ఎత్తున ప్రమోట్ చేశారు.

ఇక ఈ సినిమా మొదటి ఆట నుంచే పాజిటివ్ టాక్ తో బాక్సాఫీస్‌ వద్ద ముందుకు దూసుకుపోతుంది.. ఈ క్రమంలో హీరో నాని ఈ సినిమా డైరెక్టర్ వివేక్ ఆత్రేయ ఫోటోను ఒకదాన్ని సోషల్ మీడియాలో అభిమానులతో షేర్ చేశాడు. అందులో వివేక్ ఆత్రేయ నిద్ర పోతున్నట్టు తెలుస్తుంది. ఇది నీకోసమే అంటూ నాని రాసుకొచ్చాడు.

సూపర్‌ హిట్ కొట్టేసి వివేక్ హ్యాపీగా రెస్ట్ తీసుకుంటున్నాడు అంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ వచ్చేస్తున్నాయి. సరిపోదా శనివారం సినిమాని వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో డీవీవీ దానయ్య డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ మీద నిర్మించారు. ఈ సినిమాలో నాని సరసన ప్రియాంక మోహన్ హీరోయిన్ గా నటించగా సాయికుమార్, మురళీ శర్మ వంటి వాళ్ళు ఇతర కీలక పాత్రలలో యాక్ట్‌ చేశారు. జేక్స్ బిజాయ్ సంగీతం అందించిన ఈ సినిమాకి అదే ప్లస్ పాయింట్ అయింది అని చెప్పుకొవచ్చు.

Related Posts

Comments

spot_img

Recent Stories