కాశీలో అకీరా!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్  ముద్దుల తనయుడు అకీరా నందన్ సోషల్ మీడియాలో ఎప్పుడూ హల్‌చల్ చేస్తుంటాడు. అతడి లుక్స్, అతడి లివింగ్ స్టైల్‌తో అభిమానులను తన వైపునకు తిప్పుకుంటున్నాడు ఈ మెగా వారసుడు. తాజాగా అకీరా నందన్‌కి సంబంధించిన కొన్ని ఫోటోలు, వీడియోలు సోషల్‌ మీడియాలో వైరల్ గా మారాయి.

 పవిత్ర పుణ్యక్షేత్రం అయిన కాశీలో అకీరా నందన్ పర్యటించాడు. అక్కడి గంగానదిపై అకీరా ఓ పడవలో కూర్చుని వెళుతున్న వీడియో నెట్టింట వైరల్ గా మారింది. ఈ వీడియోలో అకీరా లుక్స్ మెగా ఫ్యాన్స్‌ను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. ఇక తనదైన టాలెంట్‌తో అకీరా ఇప్పటికే అభిమానుల్లో మంచి గుర్తింపును తెచ్చుకున్నాడు. ఇంకా సినీ ఎంట్రీ ఇవ్వకపోయినా, హీరో లక్షణాలు పుష్కలంగా ఉన్నాయంటూ అభిమానులు ప్రశంసలు కురిపిస్తున్నారు.

Related Posts

Comments

spot_img

Recent Stories