అక్కినేని యంగ్ హీరో అఖిల్ ప్రస్తుతం తన నెక్స్ట్ సినిమాని తెరకెక్కిస్తూ బిజీగా ఉన్నాడు. దర్శకుడు మురళీ కృష్ణ అబ్బూరి డైరెక్షన్‌లో తన కెరీర్‌లోని 6వ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు అఖిల్. ఇక ఈ సినిమాను అత్యంత ప్రెస్టీజియస్‌గా తెరకెక్కించేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతోంది.
కాగా, ఈ సినిమా నుంచి ఓ సాలిడ్ అప్డేట్ ఇచ్చేందుకు చిత్ర యూనిట్ సిద్దమైయ్యింది. ఈ సినిమాను రాయలసీమ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కించనున్నట్లు చిత్ర యూనిట్ ఇప్పటికే వెల్లడించింది. ఇక ఈ సినిమా నుంచి ఫస్ట్ లుక్ పోస్టర్‌తో పాటు టైటిల్‌ను ఏప్రిల్ 8న అఖిల్ బర్త్ డే కానుకగా విడుదల చేయనున్నట్లు చిత్ర వర్గాల్లో టాక్ వినపడుతుంది.
మరి ఈ సినిమాకు ఎలాంటి టైటిల్ ఫిక్స్ చేయనున్నారా.. ఈ మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ ఎలా ఉండబోతుందా అనేది ఆసక్తికరంగా మారింది.