సైలెంట్‌ గా మొదలెట్టేశాడుగా!

అక్కినేని యంగ్ హీరో అఖిల్‌ టాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చి చాలా రోజులే అవుతుంది… కానీ, ఆయనకు సరైన హిట్ మాత్రం ఇప్పటి వరకు పడలేదు. అఖిల్, హలో, మిస్టర్ మజ్ను, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్, ఏజెంట్.. ఇలా వరుస సినిమాలు చేసినా, సాలిడ్ సక్సెస్ మాత్రం పడలేదు. దీంతో అక్కినేని అభిమానులు తీవ్ర నిరాశ కు లోనవుతున్నారు.

హ్యాండ్‌సమ్ లుక్స్, అదిరిపోయే ఫిజిక్ ఉన్నా ఆయన ఖాతాలో ఒక్క సాలిడ్ హిట్ కూడా లేదు.అయితే, ఇప్పుడు అఖిల్ చాలా జాగ్రత్తగా తన తరువాత చిత్రాలను లైన్‌లో పెడుతున్నాడు. ఆయన తన తరువాత సినిమాని డైరెక్టర్‌  మురళీ కిషోర్ అబ్బూరి డైరెక్షన్‌లో చేసేందుకు రెడీ అయ్యాడు. ఈ సినిమాకు ‘లెనిన్’ అనే టైటిల్ కూడా పరిశీలనలో ఉందంట. తాజాగా ఈ మూవీ షూటింగ్‌ను కూడా అఖిల్ సైలెంట్‌గా మొదలు పెట్టినట్లుగా వార్తలు వస్తున్నాయి.

రామోజీ ఫిలిం సిటీలో వేసిన సెట్‌లో ఈ మూవీ షూటింగ్‌ ప్రారంభమైందని చిత్ర వర్గాల్లో టాక్ వినపడుతుంది. ఈ సినిమాలో యంగ్ బ్యూటీ శ్రీలీల హీరోయిన్‌గా నటిస్తున్నట్లు టాక్ నడుస్తుంది.

Related Posts

Comments

spot_img

Recent Stories