యాక్షన్ కోసం ‘అఖండ 2’ పనులు!

నందమూరి నటసింహం బాలయ్య – బోయపాటి శ్రీను కాంబోలో వచ్చిన ‘అఖండ’ అద్భుత విజయాన్ని అందుకున్న సంగతి తెలిసిందే. దీంతో ‘అఖండ 2 – తాండవం’ పై భారీ అంచనాలు ఏర్పడిన సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన పూజా కార్యక్రమాలు జరిగాయి. తాజా సమాచారం ప్రకారం వచ్చే నెల నుంచి ఓ యాక్షన్ షెడ్యూల్ ను మొదలు కానుందని ఈ షెడ్యూల్ లో బాలయ్యతో పాటు మిగిలిన టీమ్ కూడా జాయిన్ కానున్నారంట… ఈ షెడ్యూల్ కోసం బోయపాటి కసరత్తులు చేస్తున్నట్లు సమాచారం.

కాగా ప్రస్తుతం ఈ సినిమాలో నటించే నటీనటుల ఎంపిక పై బోయపాటి ఫోకస్‌పెట్టారంట. ఆల్ రెడీ, ఇప్పటికే పలు కీలక పాత్రల్లో ఇతర భాషల నటులను తీసుకోవాలని మేకర్స్ అనుకుంటున్నారంట. కాగా ఈ సినిమాను 14 రీల్స్ ప్లస్ బ్యానర్‌పై రామ్ ఆచంట, గోపీ ఆచంట సంయుక్తంగా నిర్మిస్తున్నారు. థమన్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు. బోయపాటి శ్రీను – బాలయ్య కాంబో లో హ్యాట్రిక్ విజయాలు నమోదయ్యాయి.

Related Posts

Comments

spot_img

Recent Stories