అఖండ 2 స్పీడు పెంచాల్సిందే!

గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ హీరోగా వస్తున్న “అఖండ 2” సినిమా కోసం అభిమానులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. బాలయ్య, బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో వస్తున్న ఈ సీక్వెల్‌పై అంచనాలు ఆకాశాన్నంటుతున్నాయి. “అఖండ” ఇచ్చిన ఘనవిజయం తర్వాత ఈ జోడీ మళ్లీ కలవడం సినీప్రియుల్లో పెద్ద ఎగ్జైట్‌మెంట్‌ క్రియేట్ చేసింది.

ఇక బాలయ్య మాస్ ఎనర్జీ, బోయపాటి డైరెక్షన్‌ కలిస్తే థియేటర్లలో మళ్లీ ఒక సెన్సేషన్‌ తప్పదనే నమ్మకం ఫ్యాన్స్‌లో ఉంది. కానీ ఈసారి ప్రచార కార్యక్రమాల విషయంలో మాత్రం మేకర్స్ కొంత నెమ్మదిగా ఉన్నారని అభిమానులు గమనిస్తున్నారు. డిసెంబర్ 5న సినిమా విడుదల కాబోతున్నా, ఇప్పటి వరకు ఫస్ట్ లుక్ పోస్టర్, ఒక చిన్న గ్లింప్స్‌ మాత్రమే విడుదల చేశారు.

సినిమా విడుదల దగ్గరపడుతున్న తరుణంలో, ప్రమోషన్ల వేగం పెంచాల్సిన సమయం ఇది అని ట్రేడ్ వర్గాలు సూచిస్తున్నాయి. ప్రేక్షకుల్లో మరింత ఉత్సాహం తీసుకురావాలంటే కొత్త పోస్టర్లు, టీజర్లు, పాటలు వరుసగా విడుదల చేస్తే బజ్ పెరుగుతుందని సినీ నిపుణులు అంటున్నారు.

Related Posts

Comments

spot_img

Recent Stories