కోలీవుడ్ స్టార్ హీరోస్ లో ఒకరైన నటుడు అజిత్ కుమార్ హీరోగా త్రిష హీరోయిన్ గా నటిస్తున్న అవైటెడ్ చిత్రం “విడా ముయర్చి” కోసం అందరికీ తెలిసిందే. అయితే అజిత్ నుంచి ఎంతో కాలంగా తెరకెక్కిస్తున్న ఈ సినిమా ఇప్పటికే చాలాసార్లు వాయిదా పడింది. దర్శకుడు మగిళ్ తిరుమనేని తెరకెక్కించిన ఈ సాలిడ్ యాక్షన్ డ్రామాలో అజిత్ చాలా రిస్కీ స్టంట్స్ ని కూడా చేసినట్లు తెలుస్తుంది.
అయితే ఇన్ని రోజులు తమిళ్ వెర్షన్ వరకు మాత్రమే మేకర్స్ పరిమితం చేయగా ఇపుడు ఫైనల్ గా తెలుగు వెర్షన్ ని కూడా కన్ఫర్మ్ చేశారు. ఇలా తెలుగులో “పట్టుదల” అనే టైటిల్ ని కన్ఫర్మ్ చేసి తమిళ్ తో పాటుగా తెలుగు ట్రైలర్ ని కూడా విడుదల చేస్తున్నట్టుగా కన్ఫర్మ్ చేశారు. మరి తెలుగులో ఈ సినిమాకి ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో చూడాలి.