చెపాక్‌ స్టేడియంలో అజిత్‌!

ఐపీఎల్ 2025లో భాగంగా ఏప్రిల్ 25న జరిగిన చెన్నై వర్సెస్ హైదరాబాద్ మ్యాచ్ ఉత్కంఠగా సాగింది. ఈ మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్‌ను సన్‌రైజర్స్ హైదరాబాద్ 5 వికెట్ల తేడాతో ఓడించింది. దీంతో చెన్నై ఫ్యాన్స్ తీవ్ర నిరాశకు గురయ్యారు. చెపాక్ స్టేడియంలో చెన్నై సూపర్ కింగ్స్‌కి గతంలో ఉన్న రికార్డు ఈ సీజన్‌లో మారిపోయింది.

ఇక ఈ మ్యాచ్‌ను వీక్షించేందుకు చాలా మంది అభిమానులు హాజరయ్యారు. వారితో పాటు సినీ సెలబ్రిటీలు కూడా ఈ మ్యాచ్‌ను చూశారు. వారిలో తమిళ స్టార్ హీరో అజిత్ తన భార్య శాలినితో విచ్చేశాడు అటు మరో హీరో శివ కార్తికేయన్ కూడా తన భార్య ఆర్తితో ఈ మ్యాచ్ కి వచ్చారు.

ఈ క్రమంలో శివకార్తికేయన్ ఆయన భార్య ఆర్తి, అజిత్-శాలినిలతో కలిసి ఫోటో దిగారు. ప్రస్తుతం ఈ ఫోటో నెట్టింట వైరల్ అవుతుంది. ఒక చెన్నై సూపర్ కింగ్ మ్యాచ్ చూసేందుకు.. తమ జట్టుకు మద్దతు ఇచ్చేందుకు ఇద్దరు తమిళ హీరోలు తమ ఫ్యామిలీతో రావడం సంతోషంగా ఉందని తమిళ అభిమానులు,నెటిజన్లు  కామెంట్లు చేస్తున్నారు.

Related Posts

Comments

spot_img

Recent Stories