తాజాగా థియేటర్లలో రిలీజ్ అయ్యి మంచి స్పందన తెచ్చుకున్న చిత్రాల్లో తేజ సజ్జ నటించిన “మిరాయ్” కూడా ఒకటి. ఈ సినిమాను కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వం వహించగా, ప్రేక్షకులు మొదటి షో నుంచే పాజిటివ్ టాక్ ఇస్తున్నారు. ఫిలిం ఇండస్ట్రీలోని పలువురు ప్రముఖులు కూడా ఈ సినిమాను మెచ్చుకుంటున్నారు.
ఇక సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ కూడా తన రియాక్షన్ తో సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయ్యారు. తన పోస్ట్ లో “మిరాయ్”ని ఆకాశానికి ఎత్తేస్తూ, బాహుబలి తర్వాత ఇంత బలమైన యూనానిమస్ రెస్పాన్స్ తెచ్చుకున్న సినిమా ఇదే అని చెప్పడం జరిగింది. అలాగే సినిమాలోని విజువల్ ఎఫెక్ట్స్, కథనం హాలీవుడ్ స్థాయిలో ఉన్నాయంటూ ప్రత్యేకంగా హైలైట్ చేశారు.
ఆయన చేసిన ఈ కామెంట్స్ కాసేపటికే సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో “మిరాయ్”పై మరింత హైప్ క్రియేట్ అయ్యింది.