నందమూరి బాలకృష్ణ, సింగీతం శ్రీనివాస్ రావు కాంబినేషన్‌లో తెరకెక్కిన టాలీవుడ్ తొలి టైమ్ ట్రావెల్ చిత్రం ‘ఆదిత్య 369’. అప్పట్లోనే ఈ మూవీ బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో అందరికీ తెలిసిందే. ఈ సినిమాలో హీరో టైమ్ మెషిన్‌లో ట్రావెల్ చేసి వేర్వేరు కాలాలకు ప్రయాణం చేస్తాడు.
ఇలాంటి సరికొత్త కాన్సెప్ట్‌తో ఈ సినిమా రావడంతో ప్రేక్షకులకు ఇది బాగా నచ్చింది. ఇక ఎవర్‌గ్రీన్ క్లాసిక్ చిత్రాల్లో ‘ఆదిత్య 369’ స్థానం ప్రత్యేకంగా నిలిచింది. ఇక ఈ సినిమా నేడు థియేటర్లలో రీ-రిలీజ్ అవుతోంది. దీంతో ఈ సినిమాను మరోసారి వెండితెరపై చూసేందుకు ప్రేక్షకులు ఆసక్తిని చూపుతున్నారు. ఈ సినిమాలో ఎంతో కీలకమైన టైమ్ మెషిన్ అందరికీ తెలిసే ఉంటుంది.
ఈ చిత్ర రీ-రిలీజ్ సందర్భంగా హైదరాబాద్‌లోని ప్రసాద్స్ థియేటర్ వద్ద ఈ టైమ్ మెషిన్ ప్రదర్శనకు పెట్టారు. దీంతో అక్కడికి వచ్చే ప్రేక్షకులు దీన్ని చూసి ఎంజాయ్ చేస్తున్నారు. ఇక ‘ఆదిత్య 369’ చిత్రంలో మోహిని హీరోయిన్‌గా నటించగా సిల్క్ స్మిత, సుత్తివేలు, అమ్రిష్ పూరి, టిన్ను ఆనంద్ తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లో నటించారు. ఇళయరాజా ఈ చిత్రానికి సంగీతం అందించారు. మరి ఈ సినిమా రీ-రిలీజ్‌లో ఎలాంటి రెస్పాన్స్ అందుకుంటుందో చూడాలి.