తెలుగులో నటించడం చాలా ఇబ్బందిగా ఉంటుంది!

టాలీవుడ్‌ లో భీమ్లా నాయక్‌ సినిమాతో ఎంట్రీ ఇచ్చిన  ముద్దుగుమ్మ సంయుక్త మీనన్. అతి తక్కువ కాలంలోనే ఇండస్ట్రీలో మంచి పేరు తెచ్చుకుని డైరెక్టర్‌ లకు ఫస్ట్‌ ఛాయిస్‌ గా మారింది.  ‘బింబిసారా, సార్, విరూపాక్ష, డెవిల్’ వంటి మూవీస్‌తో తన క్రేజ్ మరింత పెంచుకున్న ఈ బ్యూటీ.. ప్రస్తుతం భాషతో సంబంధం లేకుండా వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉంటోంది.

ఈ క్రమంలోనే తెలుగులో నిఖిల్ ‘స్వయంభూ’ తో పాటు.. శర్వానంద్, బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌తో కూడా సినిమాలను ఓకే చేసినట్లు సమాచారం. ఇదిలా ఉంటే.. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈ బ్యూటీ టాలీవుడ్‌పై చేసిన కామెంట్స్ నెట్టింట సంచలనంగా మారాయి. ‘మలయాళంతో పోలిస్తే తెలుగు సినిమాల్లో నటించాలంటే చాలా కష్టం. భాష రాకపోవడం ఓ కారణం అయితే.. మేకప్ మరో రీజన్.

ఎందుకంటే మలయాళంలో చాలా తక్కువ మేకప్ వేస్తారు. నటించడానికి కూడా చాలా కంఫర్ట్‌గా, ఫ్రీగా, నేచురల్‌గా ఉంటోంది. కానీ తెలుగులో అలా కాదు. మేకప్ చాలా ఎక్కువగా వేస్తారు. అంతే కాకుండా స్క్రీన్‌ పై మనం ఎలా కనిపిస్తామో అని.. షాట్ మధ్యలో కూడా మేకప్ చెక్ చేసుకోవాలి. అది నటించడానికి అంత కంఫర్ట్‌గా అనిపించదు. చర్మంపై ఏదో ఉన్నట్లే అనిపిస్తుంది నాకు’ అంటూ తెలిపింది. ప్రస్తుతం సంయుక్త చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్ గా మారుతున్నాయి.

Related Posts

Comments

spot_img

Recent Stories