‘ఓజి’ సెట్స్ లోకి ఆంధీ ఆగమనం..

పవన్ కళ్యాణ్ ప్రస్తుతం చేస్తున్న సినిమాల్లో ఓజి మీదే ప్రేక్షకుల్లో అత్యధికంగా ఆసక్తి నెలకొంది. ఈ సినిమా అనౌన్స్ అయిన రోజునుంచి ఇది భారీగా హైప్ సొంతం చేసుకుంది. సుజీత్ దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ ప్రాజెక్ట్‌కి సంబంధించిన ఒక్కో అప్డేట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుండటం చూస్తే, దీనికి ఎంత స్థాయిలో క్రేజ్ ఉందో అర్థం అవుతుంది.

కొంతకాలంగా షూటింగ్ కు విరామం ఇచ్చిన మేకర్స్ ఇప్పుడు మళ్లీ షెడ్యూల్ మొదలుపెట్టారు. తాజా సమాచారం ప్రకారం మే 14 నుంచి హైదరాబాద్‌లో షూటింగ్ జరుగనున్నట్టుగా తెలుస్తోంది. పవన్ కళ్యాణ్ కూడా అదే రోజు సెట్లో జాయిన్ అయ్యే అవకాశం ఉందని చెబుతున్నారు.

ఈ షెడ్యూల్ ద్వారా పవన్ కు సంబంధించిన కీలక సీన్లన్నీ పూర్తి చేయాలని టీమ్ భావిస్తోంది. జూన్ 10వ తేదీ వరకు ఈ భాగాన్ని పూర్తిగా కంప్లీట్ చేయాలనే టార్గెట్ పెట్టుకున్నారని టాక్ వినిపిస్తోంది. దీంతో పవన్ అభిమానుల్లో ఒక్కసారిగా ఉత్సాహం పెరిగిపోయింది.

సినిమాకు థమన్ మ్యూజిక్ అందిస్తుండగా, డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ ఈ ప్రాజెక్ట్‌ను నిర్మిస్తోంది. అన్ని విధాలుగా చూసుకుంటే, ఈసారి పవన్ సినీ స్క్రీన్‌పై చూపించబోయే మాస్ స్టైల్‌కు ప్రేక్షకులు ఊహించని రీతిలో రెస్పాండ్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Related Posts

Comments

spot_img

Recent Stories