2 సంవత్సరాల్లో 75 సినిమాలు వద్దన్న యంగ్‌ హీరో!

జాంబీ రెడ్డి సినిమాతో నటుడిగా మారిన యంగ్‌ హీరో తేజ సజ్జా. ఆ సినిమా మంచి హిట్ అవ్వడంతో  ఆయనకు సినిమా అవకాశాలు వెదుక్కుంటూ వచ్చాయి. అయితే తేజ కేవలం రెండు సంవత్సరాల కాలంలో సుమారు 75 సినిమాలను తిరస్కరించాడని సమాచారం. ఎందుకంటే ఆ రెండు సంవత్సరాలు కూడా తేజ హనుమాన్‌ సినిమా మీదనే ఉన్నాడని సమాచారం.

అయితే హనుమాన్ విడుదల తర్వాత ఇండియా వ్యాప్తంగా మంచి ఆదరణ పొంది కలెక్షన్ల రాబట్టింది.తేజా సజ్జా ఈ సినిమా కోసం 2 సంవత్సరాలకు పైగా ఓపిక పట్టినందుకు అతనికి ఈ సినిమా భారీ ప్రోత్సాహాన్ని ఇచ్చింది. హనుమాన్ విజయంతో తేజ సజ్జా పిల్లలు, పెద్దలలో ప్రముఖ నటుడిగా మారిపోయారు. ఇప్పుడు అతని మార్కెట్ కూడా ఒక్కసారిగా పెరిగింది. దీంతో అతని కథ ఎంపిక చేసుకోవడం లో చూపించిన నైపుణ్యాన్ని సినీ వర్గాలు కూడా కొనియాడాయి.

Related Posts

Comments

spot_img

Recent Stories