బిజినెస్‌ రంగంలోకి అడుగుపెట్టిన యంగ్‌ హీరో!

మన తెలుగు చిత్ర కథానాయకులు సినిమాలతో పాటు ఇతర రంగాల్లోనూ రాణిస్తున్న విషయం తెలిసిందే. ఈ జాబితాలోకి ముఖ్యంగా మహేష్, బన్నీ, విజయ్ దేవరకొండ, లాంటి హీరోలు మల్టీప్లెక్స్ బిజినెస్ లోకి ఎంట్రీ ఇచ్చి విజయవంతం గా ముందుకెళ్తున్నారు. ఈ మధ్య మన మాస్ మహారాజా రవితేజ కూడా ఈ బిజినెస్ లోకి అడుగుపెట్టాడు. ఇక తాజాగా లవర్ బాయ్ నితిన్ సైతం ఈ లిస్ట్ లో చేరిపోయాడు.

హీరో నితిన్ ఏషియన్ సంస్థతో కలిసి ‘ANS’ సినిమాస్ అనే మల్టీప్లెక్స్ ను త్వరలోనే ప్రారంభించ‌బోతున్న‌ట్లు తెలుస్తుంది. నితిన్‌కు ఇంత‌కుముందే సితార థియేట‌ర్ ఉన్న విష‌యం తెలిసిందే. తెలంగాణ సంగారెడ్డిలో ఉన్న ఈ థియేట‌ర్ ప్ర‌స్తుతం నూతన హంగులు అద్దుకుంటుంది.  అయితే ఆ థియేట‌ర్‌ను ఏషియన్ సంస్థతో కలిసి స‌రికొత్త హంగుల‌తో మల్టీప్లెక్స్ నిర్మిస్తున్న‌ట్లు సమాచారం.

ఇక ఈ థియేట‌ర్‌కు ‘ఏషియన్ నితిన్ సితార అని పేరు పెట్టిన‌ట్లు తెలుస్తుంది. త్వరలోనే నితిన్ ఈ మల్టీప్లెక్స్ ను గ్రాండ్ గా లాంచ్ చేయబోతున్నట్లు సమాచారం. 

Related Posts

Comments

spot_img

Recent Stories