అవయవ దానం చేసిన యంగ్‌ హీరో!

మాస్‌ కా దాస్‌ విశ్వక్‌ సేన్‌ తాజాగా పలువురికి ఆదర్శంగా నిలిచారు. ఆయన కేవలం సినిమాల్లోనే కాదు నిజ జీవితంలోనూ హీరో అని అందరి చేత ప్రశంసలు అందుకుంటున్నారు. తన అవయవాలను దానం చేసి ఎందరికో ఆదర్శంగా నిలిచాడు.  అవయవ దానానికి మద్దతిస్తూ, దాని పై అవగాహన కల్పించేందుకకు ఏర్పాటు చేసిన మెట్రో రెట్రో నోబుల్‌ కాజ్‌ ఈవెంట్‌ కు అతిథిగా వెళ్లిన నటుడు విశ్వక్‌..ఆ వేడుకలో తన అవయవాలను దానం చేస్తున్నట్లు ప్రకటించారు.

తనతో పాటు తన అభిమానులు సైతం ఈ మహత్తర కార్యక్రమంలో పాల్గొనాలని ఆయన పిలుపునిచ్చారు. ఇంత గొప్ప నిర్ణయం తీసుకున్న విశ్వక్‌పై ఆ కార్యక్రమంలో పాల్గొన్న అందరూ ప్రశంసల జల్లు కురిపించారు. ఇక విశ్వక్ చేసిన ఈ గొప్ప పని సోషల్ మీడియా ద్వారా బయటికి రావడంతో నెటిజన్స్ తో పాటు సినీ ప్రముఖులు కూడా  ఆయనపై ప్రశంసలు కురిపిస్తున్నారు. ‘ విశ్వక్ నిజంగా రియల్ హీరో అని, అతన్ని చూసి మిగతా యంగ్‌ హీరోలు కూడా  అవయవ దానం చేసేందుకు ముందుకు రావాలని కామెంట్లు పెడుతున్నారు.

Related Posts

Comments

spot_img

Recent Stories