టాలెంటెడ్ హీరో ధర్మ తన నటనతో ప్రేక్షకులను అలరించి మంచి గుర్తింపును పొందాడు. “డ్రింకర్ సాయి” సినిమాతో విశేషమైన ప్రశంసలు పొందిన అతను, ఈ సినిమాతో పలు అవార్డ్స్ కూడా దక్కించుకున్నాడు. ఇప్పుడు, ఈ యంగ్ హీరో తన అభిమానులను మరింత ఆకట్టుకునే ప్రాజెక్ట్స్‌తో ముందుకు వెళ్ళిపోతున్నాడు. కొత్త సినిమాల కోసం త్వరలో అధికారిక ప్రకటన చేయాలని ప్లాన్ చేస్తున్నాడు.
గతంలో విడుదలైన “డ్రింకర్ సాయి” సినిమా యూత్ తో పాటు ఫ్యామిలీ ఆడియెన్స్ ను కూడా ఆకట్టుకుని బాగానే విజయాన్ని సాధించింది. ఈ సినిమాలో ధర్మ తన డ్యాన్స్, యాక్టింగ్, ఫైట్స్ తో ప్రేక్షకులను మెప్పించాడు. సాయి పాత్రలో అతని పెర్ఫార్మెన్స్ ప్రత్యేకంగా నిలిచింది. టీజింగ్, ఫన్, ఎమోషనల్ సీన్స్ లో ధర్మ ఇచ్చిన మెచ్యూర్డ్ యాక్టింగ్ అందరినీ ఆకట్టుకుంది.
ప్రస్తుతం, ధర్మ తన తదుపరి సినిమాలను మరింత జాగ్రత్తగా ప్లాన్ చేస్తూ, కొత్తదనాన్ని, ఇన్నోవేటివ్ స్క్రిప్ట్స్ ను ఎంచుకోగా, టాలెంటెడ్ డైరెక్టర్స్ తో పనిచేసేందుకు ఆసక్తిగా ఉన్నాడు.