జగన్ పైశాచిక ఆనందానికి ఏడాది పూర్తి!

ఆయనేమీ విదేశాలకు పారిపోయేంత నేరం చేయలేదు. నేరానికి సంబంధించి నోటీసులు కూడా లేదు. పోనీ.. విదేశాలకు పర్యటనకు వెళ్లాలన్నా సరే.. కోర్టు అనుమతి తీసుకోవాల్సిన రీతిలో విచారణను ఎదుర్కొంటున్న వ్యక్తి కూడా కాదు. అలాంటి చంద్రబాబునాయుడు.. సాధారణ జిల్లా పర్యటనల్లో ఉంటే.. అర్ధరాత్రి దాటిన తర్వాత.. పెద్ద సంఖ్యలో పోలీసుల్ని ఆయన నిద్రిస్తున్న బస్సు చుట్టూ మోహరించి.. అప్పటికప్పుడు అరెస్టు చేయడానికి చేసిన ప్రయత్నాన్ని ఈ రాష్ట్రం మొత్తం అసహ్యంగా వీక్షించి ఏడాది గడిచింది. సెక్యూరిటీ వారు అడ్డుకోవడంతో తెల్లవారే దాకా ఆగి.. చంద్రబాబునాయుడును అరెస్టు చేసి, దుర్మార్గమైన రీతిలో 74 ఏళ్లు వయస్సున్న సీనియర్ నాయకుడిని.. అరాచకంగా రోడ్డు మార్గంలో అధ్వానమైన రోడ్లలో తిప్పుతూ గుంటూరుకు విచారణ నిమిత్తం తరలించిన.. పైశాచిక కృత్యాలు  చోటు చేసుకుని ఇవాళ్టికి ఏడాది గడిచింది. నాలుగేళ్లకుపైగా తన పరిపాలనలోని రకరకాల అరాచకాలతో చెలరేగిపోయిన జగన్మోహన్ రెడ్డి అలాంటి పాపాలన్నింటికీ పరాకాష్ట లాగా.. చంద్రబాబును అర్థం పర్థం లేని కేసులో అరెస్టు చేయించినది ఇవాళే. శిశుపాలుడి పాపాలు పండినట్టుగా.. ఈ తప్పు చేయడం ద్వారా జగన్ పాపాలు కూడా పండాయి. తన పాలనకు తానే మరణశాసనం రాసుకున్నారు జగన్మోహన్ రెడ్డి.

జగన్ కళ్లలో ఆనందం చూడడానికి రెచ్చిపోయిన పోలీసు మూకలు.. అప్పటి ప్రతిపక్ష నాయకుడి అరెస్టు విషయంలో కనీస మర్యాదలు గానీ, పద్ధతులు గానీ పాటించలేదన్నది నిజం. విచారణకు హాజరు కావాల్సింది గా నోటీసులు ఇస్తే సరిపోయేదానికి, దుర్మార్గమైన రీతిలో అరెస్టుచేశారు. జైల్లో పెట్టారు. విచారణ పేరిట ఒక రోజంతా హింసించారు. కానీ ధీరోదాత్తుడైన చంద్రబాబు, జైల్లో గడపాల్సి వచ్చినా కూడా మనో నిబ్బరం కోల్పోలేదు.

ఇలాంటి పని చేయడం ద్వారా.. జగన్మోహన్ రెడ్డి.. చంద్రబాబును కూడా జైల్లో పెట్టించాను అనే శాడిస్టిక్ ఆనందాన్ని పొందిన మాట నిజమే. కానీ.. సాధించింది మాత్రం ఏమీ లేదు. నిజానికి రాష్ట్రంలో మార్పు దిశగా అప్పటికే పురుడుపోసుకుంటున్న రాజకీయ సమీకరణలు, పునరేకీకరణలు వేగవంతం కావడానికి జగన్మోహన్ రెడ్డి ప్రధాన కారకులు అయ్యారు. అప్పటిదాకా ఎన్డీయేలో భాగస్వామిగా ఉంటూ.. తెలుగుదేశంతో మైత్రీ బంధాన్ని ప్రకటించడానికి బిజెపి అనుమతి కూడా తీసుకోవడం అవసరం కదా.. అనే ఊగిసలాటలో ఉన్న జనసేనాని పవన్ కల్యాణ్.. జైలుకు వెళ్లి చంద్రబాబును పరామర్శించి బయటకు వచ్చిన వెంటనే.. తెలుగుదేశంతో పొత్తు పెట్టుకుని ఎన్నికలకు వెళ్లబోతున్నట్టుగా తేల్చిచెప్పేశారు. తద్వారా.. వారిద్దరి బంధానికి, క్రమేపీ అది కూటమిబంధంగా మారడానికి జగన్ తన చేజేతులా గట్టి పునాది వేశారు.

పడ్డవాడెప్పుడే చెడ్డవాడు కాదంటారు పెద్దలు. చంద్రబాబును శాడిస్టిక్ గా హింసించడంలో జగన్ ఒక ఆనందం పొందారు. కానీ.. తన చర్యతో, తన తీరు పట్ల యావత్ రాష్ట్ర ప్రజల్లో ఒక అసహ్యభావనకు జగన్ బీజం వేశారు. అది రకరకాలుగా ముదిరి చంద్రబాబుమీద సానుభూతి వెల్లువెత్తింది. జగన్ పతనాన్ని నిర్ద్వంద్వంగా శాసించింది. సరిగ్గా పోయినేడాదిలాగా.. ఈ వేళలో కూడా జగన్ విదేశాలలో ఉండవలసిన వారే గానీ.. పరిస్థితులు వికటించి బెంగుళూరు ప్యాలెస్ లో సేదతీరుతున్నారు.

Related Posts

Comments

spot_img

Recent Stories