నాని మూవీలో యువ కెరటం!

నాని నటించిన లేటెస్ట్ మూవీ హిట్ 3 ప్రేక్షకుల మద్దతుతో ఘనవిజయం సాధించింది. యాక్షన్, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్‌తో రూపొందిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్లు రాబట్టింది. ఈ మూవీకి శైలేష్ కొలను దర్శకత్వం వహించాడు. ఇప్పుడు ఈ విజయం తర్వాత నాని తన తదుపరి ప్రాజెక్ట్‌లపై దృష్టిపెట్టినట్టు సమాచారం.

అయితే, ఆయన ఇప్పుడు శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో తెరకెక్కే కొత్త సినిమా “ది ప్యారడైజ్” కోసం రెడీ అవుతున్నాడు. ఈ మూవీ ప్రారంభమైందన్న వార్తల నేపథ్యంలో, నాని కూడా త్వరలో షూటింగ్‌లో చేరనున్నట్లు టాక్. ఇక ఈ సినిమాకు సంబంధించి హీరోయిన్ ఎవరనే విషయంపై ఆసక్తికరమైన వార్తలు వెలుగులోకి వచ్చాయి.

తాజాగా కయాదు లోహర్ అనే యువ హీరోయిన్ ఈ సినిమాలో నటించనున్నట్లు ఫిల్మ్ సర్కిల్స్‌లో వినిపిస్తోంది. గతంలో తమిళ నటుడు ప్రదీప్ రంగనాథన్‌తో కలిసి నటించిన డ్రాగన్ అనే సినిమాలో ఆమె పెర్ఫార్మెన్స్‌కు మంచి స్పందన వచ్చింది. దాంతో ఆమెను ఈ ప్రాజెక్ట్‌కు ఎంపిక చేసినట్లు వినిపిస్తోంది.

ఇంకా మరో క్రేజీ హీరోయిన్ కూడా ఈ సినిమాలో భాగం కానుందన్న వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఈ వార్తలపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. నిర్మాతలు త్వరలోనే క్లారిటీ ఇవ్వొచ్చని అంటున్నారు. 

Related Posts

Comments

spot_img

Recent Stories