తెలుగు ప్రేక్షకుల్ని మళ్ళీ కలిసిన స్టార్ హీరోయిన్ సమంత ఈసారి నటిగా కాదు, నిర్మాతగానూ ప్రేక్షకుల ముందుకు వచ్చిందని చెప్పాలి. ఆమె నిర్మించిన తాజా చిత్రం “శుభం” మంచి స్పందన తెచ్చుకుంది. ఈ సినిమాలో కొత్తతరానికి చెందిన హర్షిత్ రెడ్డి, గవిరెడ్డి శ్రీనివాస్, చరణ్ పేరి, శ్రియ కొంతం, శ్రావణి లక్ష్మి, షాలిని కొండేపుడి వంటి నటీనటులు కనిపించారు. ప్రేక్షకులు సినిమా చూసిన తర్వాత శుభం అనే టైటిల్ కూడా ఎంత బాగుందని ఫీల్ అయ్యారు.
ఇక ఈ సినిమా విజయోత్సవ వేడుకలో సమంత చేసిన ఓ ఆసక్తికర వ్యాఖ్య ఇప్పుడు హైలైట్ అవుతోంది. అసలుగా శుభం అనే టైటిల్ పెట్టకముందు, ‘దెయ్యం దిద్దిన కాపురం’ అనే పేరును తీసుకోవాలని ఆలోచించారట. ఎందుకంటే సినిమాలో కథ అంతా ఆ స్పేస్‌లోనే సాగుతుంది. అలాంటి కాన్సెప్ట్‌కి ఆ పేరూ బాగానే సరిపోతుందని భావించారట. కానీ కథ ముగింపు ఎంతో భావోద్వేగంగా ఉండటంతో, శుభం అనే పేరు పెట్టాలనే నిర్ణయానికి వచ్చారట.
ఇలా ఒక మినిమమ్ హారర్ టచ్ ఉన్న కథకి శుభాంతం అన్న భావనతో ముగింపు ఉండటం వలన, శుభం అనే టైటిల్ యాప్ట్‌గా నిలిచింది. ముందుగా ఎలాగైనా భయానకంగా ఉండేలా పేరుకి ప్లాన్ చేసినా, చివరికి కథలో ఉన్న పాజిటివ్ మెసేజ్‌ని పరిగణలోకి తీసుకుని టైటిల్‌ను మార్చారన్నది ఇప్పుడు ఇంట్రెస్టింగ్ అంశంగా మారింది.