తండేల్‌ నుంచి అదిరిపోయే పాట!

యువసామ్రాట్‌ వారుసుడు అక్కినేని నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా తెరకెక్కుతున్న సినిమా ‘తండేల్’. ఈ సినిమాకి చందూ మొండేటి డైరెక్షన్‌ చేస్తున్నారు. ప్రతిష్టాత్మక గీతా ఆర్ట్స్ బ్యానర్‌పై అల్లు అరవింద్ సమర్పణలో బన్నీ వాస్ ఈ సినిమాని స్వయంగా నిర్మిస్తున్నారు. అయితే , శ్రీకాకుళంలో శ్రీముఖలింగం అని ఓ పురాతన శివాలయం ఉన్న సంగతి తెలిసిందే. ఈ ఆలయంలో మహా శివరాత్రిని అపారమైన భక్తితో ఎంతో వైభవంతో గొప్ప పండుగగా నిర్వహించే సంగతి అందరికీ తెలిసిందే.

కాగా, ఈ ఆలయం ప్రేరణతో ఈ సినిమా కోసం ఓ అద్భుతమైన.. ముఖ్యంగా మునుపెన్నడూ చూడని ఓ శివరాత్రి పాటను ప్లాన్ చేసి రూపొందించేందుకు తండేల్ టీమ్ రెడీ అయ్యింది. శివరాత్రి ఉత్సవాలను విస్మయపరిచేలా, పైగా అన్ని వయసుల వారికి కనెక్ట్ అయ్యేలా ఈ పాట ఉండనుంది. పైగా ఈ పాట కోసం విస్తృతమైన సెట్టింగ్‌ లతో పాటు భారీ వ్యయంతో ఈ పాటను చిత్రీకరించారు. దేవి శ్రీ ప్రసాద్ కంపోజింగ్, శేఖర్ మాస్టర్ నృత్య దర్శకత్వం ఈ పాటకు ప్లస్ అవుతున్నాయి.

ఈ పాటలో నాగ చైతన్య – సాయి పల్లవిలతో పాటు వేలాది మంది డ్యాన్సర్‌ లు కూడా చేశారు. నాగ చైతన్య కెరీర్‌లోనే అత్యంత ప్రత్యేకమైన పాటగా ఈ పాట నిలుస్తుందని చిత్ర బృందం ఆశాభావం వ్యక్తం చేస్తుంది. ఇక సాంగ్ షూట్ నుండి రెండు పోస్టర్లను కూడా మేకర్స్ తాజాగా ప్రేక్షకుల ముందుకు తీసుకుని వచ్చారు.
ఈ తండేల్ చిత్రం పాన్ ఇండియా సినిమాగా.. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం మరియు హిందీ భాషల్లో విడుదల అవ్వనుంది.

Related Posts

Comments

spot_img

Recent Stories