విజయసాయి చుట్టూ బిగుసుకున్న ఉచ్చు!

ఒక నేరం జరిగిందనే అంచనాతో విచారణకు రావాల్సిందిగా నిందితులకు విచారణ సంస్థ నోటీసులు ఇచ్చింది. ఒకరు కాకకపోతే మరొకరైనా విచారణకు హాజరు కావాలి కదా! నోటీసులు అందుకున్న వారందరూ తలా ఒక కారణం చెప్పి విచారణనే తప్పించుకోవాలని చూసినట్లయితే దానిని దేనికి సంకేతంగా భావించాలి? చాలా స్పష్టంగా ఆ కేసు చాలా బలమైనదని, విచారణనుంచి తాము తప్పించుకోజాలమని.. ఎవాయిడ్ చేస్తే ఈలోగా ఏమైనా దొంగమార్గాలు వెతుక్కోవచ్చునని ఆరాటపడుతున్నట్టుగా అనిపిస్తోంది. కాకినాడ పోర్టును కేవీ రావునుంచి బెదిరించి వాటాలు కొనుగోలు చేసిన కేసులో.. ప్రస్తుతం విజయసాయరెడ్డి అండ్ కో వ్యవహారం గమనిస్తే అలాగే అనిపిస్తోంది.

కాకినాడ సీపోర్టు స్మగ్లింగుకు అడ్డాగా మారుతున్న వ్యవహారం వెలుగులోకి వచ్చిన తరువాత.. చాలా విషయాలు బయటపడ్డాయి. పవన్ కల్యాణ్ పర్యటన తర్వాత.. అసలు పోర్టు యాజమాన్యం జగన్ హయాంలో బలవంతంగా చేతులు మారినట్టుగా గుర్తించారు. వైవీ సుబ్బారెడ్డి తనయుడు విక్రాంత్ రెడ్డి, విజయసాయిరెడ్డి, ఆయన అల్లుడికి సోదరుడు శరత్ చంద్రారెడ్డి తదితరులు.. తనను బెదిరించి వాటాలు కొన్నట్లు కేవీరావు ఏపీ సీఐడీకీ ఫిర్యాదు చేశారు. అయితే వారి ప్రాథమిక విచారణలో భారీగా మనీలాండరింగ్ కూడా జరిగినట్టు గుర్తించారు. దాంతో కేంద్ర ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరక్టరేట్ రంగంలోకి దిగింది. విక్రాంత్ రెడ్డికి ఈడీ నోటీసులు ఇచ్చిన సంగతి ఆల్రెడీ తెలిసిందే.
అయితే ఈడీ వారు కేవలం విక్రాంత్ రెడ్డికి మాత్రమే కాకుండా ఎంపీ విజయసాయిరెడ్డి, శరత్ చంద్రారెడ్డి, పీకేఎఫ్ శ్రీధర్ అండ్ సంతానం ఎల్ఎల్పీ ప్రతినిధులకు కూడా ఈడీ నోటీలసులు పంపింది. విచారణకు హాజరు కావాలని ఆదేశించింది. ఇక్కడే అసలు ట్విస్టును గమనించాలి.

ప్రస్తుతం పార్లమెంటు సమావేశాలు జరుగుతున్నందున.. తాను విచారణకు హాజరు కాలేనని విజయసాయి వారికి ప్రత్యుత్తరమించ్చారు. అనారోగ్యంగా ఉన్నది గనుక తాను రాలేనని వైవీ సుబ్బారెడ్డి కొడుకు విక్రాంత్ రెడ్డి తెలియజేశారు. ప్రస్తుతం విచారణకు రావడం కుదరదు అంటూ పెనక శరత్ చంద్రారెడ్డి కబురు పంపారు. ఇప్పుడు వారికి ఈడీ మరోసారి నోటీసులు పంపుతుంది.. విచారించి ఏ సంగతీ తేలుస్తుంది. అది వేరే సంగతి.
అయితే ఇక్కడ కీలకంగా గమనించాల్సింది ఏంటంటే.. కాకినాడ పోర్టు వాటాలను కొనడంలో భారీగా మనీలాండరింగ్ పాల్పడిన కేసు విషయంలో ఈ నిందితులు భయపడుతున్నారు. ఎప్పటికీ ఆ విషయం బయటపడదు అనుకున్నారో ఏమో గానీ.. ఇప్పుడు తమ బాగోతం వెలుగులోకి వస్తుండే సరికి కంగారుపడుతున్నారు. విచారణకు హాజరు కావడం అంటూ జరిగితే.. అడ్డంగా దొరికిపోతాం అని వారు ఆందోళన చెందుతున్నట్టుగా ఉందని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. తప్పు జరిగిందనడానికి ఇదే పెద్ద ఉదాహరణ అని ప్రజలు వ్యాఖ్యానిస్తున్నారు.

Related Posts

Comments

spot_img

Recent Stories