మైనపు విగ్రహంతో స్టైలిష్ స్టార్‌!

జాతీయ నటుడిగా పేరు తెచ్చుకున్న ఐకాన్‌ స్టార్ అల్లు అర్జున్‌ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తనకంటూ ఓ స్పెషల్‌ ఇమేజ్‌ ని సొంతం చేసుకున్నాడు. కేవలం తెలుగులోనే కాకుండా బన్నీ కి ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఉన్నారు.  ఈ క్రమంలోనే ఆయన కు మరో అరుదైన గౌరవం సొంతం అయ్యింది.

దుబాయ్‌ లోని మేడమ్‌ టుస్సాడ్స్‌ లో గురువారం అల్లు అర్జున్‌ మైనపు విగ్రహన్ని ఆవిష్కరించారు.  దీని గురించి ఎంతో సంతోషంగా ఉన్న బన్నీ సోషల్‌ మీడియా వేదికగా తన అభిమానులకు థ్యాంక్స్ చెప్పడమే కాకుండా.. ఓ స్పెషల్‌ ఫోటోను కూడా పంచుకున్నారు. ప్రతి నటుడికి మైనపు విగ్రహం అనేది ఓ మైలురాయిగా ఆయన పేర్కొన్నారు.

దీనికి సంబంధించిన ఓ ఫోటోను కూడా బన్నీ షేర్‌ చేశారు. అల వైకుంఠపురంలో ఎంతో క్రేజ్‌ సొంతం చేసుకున్న ఐకానిక్‌ సీన్స్‌ కి సంబంధించిన ఫోటోను విగ్రహంగా మ్యూజియంలో ఏర్పాటు చేశారు. విగ్రహంతో బన్నీ బ్యాక్ పోజ్‌ ఇచ్చారు. ఈ ఫోటో అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటుంది.

Related Posts

Comments

spot_img

Recent Stories