పవన్ కళ్యాణ్ ఈసారి తన అభిమానులకు చక్కటి ట్రీట్ ఇవ్వనున్నాడు. చాలా కాలం తర్వాత ఒకే ఏడాదిలో రెండు సినిమాలతో స్క్రీన్‌పైకి రావడమే కాకుండా, మరో మాస్ ఎంటర్‌టైనర్‌తో సిద్ధమవుతున్నాడు. హరీష్ శంకర్ దర్శకత్వంలో రూపొందుతోన్న “ఉస్తాద్ భగత్ సింగ్” అనే సినిమా ప్రస్తుతం ఫుల్ స్పీడ్‌లో షూటింగ్ జరుపుకుంటోంది.
ఇప్పటికే పవన్ నటిస్తున్న “ఓజి” సినిమా గురించి బర్త్‌డే స్పెషల్ ట్రీట్ వస్తుందన్న ఊహాగానాలు ఉన్నాయి. అదే రోజు అంటే సెప్టెంబర్ 2న “ఉస్తాద్ భగత్ సింగ్” సినిమా నుంచి కూడా ఒక భారీ అప్‌డేట్ ఉండే అవకాశం ఉందంటూ ఫిలింనగర్ వర్గాల్లో చర్చ నడుస్తోంది. ఒకేసారి రెండు ప్రాజెక్టుల నుంచి అప్‌డేట్స్ వస్తే పవన్ అభిమానులకి ఇది రెండు రెట్లు సంబరమే.
ఈ సినిమాలో సంగీతం అందిస్తున్నది దేవిశ్రీ ప్రసాద్. అటు మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణంలో ఈ మాస్ యాక్షన్ డ్రామా తెరకెక్కుతోంది. పవన్ స్టైల్ కి తగిన యాటిట్యూడ్, డైలాగ్స్‌తో రూపొందుతున్న ఈ సినిమా బర్త్‌డే స్పెషల్ ట్రీట్ ఇస్తుందా అన్నది అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. కానీ అందుకు రంగం సిద్ధంగా ఉన్నట్టు ఫ్యాన్స్ ఆశాభావంతో ఉన్నారు.