షాకిచ్చిన రోటీ కపడా రొమాన్స్‌!

టాలీవుడ్‌లో తెరకెక్కిన తాజా సినిమా ‘రోటీ కపడా రొమాన్స్’ రిలీజ్‌కు ఒక్క రోజు ముందు ప్రేక్షకులకు పెద్ద షాకే ఇచ్చింది. తరుణ్, నువ్వేక్ష, మేఘలేఖ, ఖుష్బూ చౌదరిసుప్రజ్ రంగా, హర్ష నర్రా, సందీప్ సరోజ్, తరుణ్, సుప్రజ్ రంగా, సోనూ ఠాకూర్,  నటీనటులుగా నటించిన ఈ రొమాంటిక్ ఎంటర్‌టైనర్ మూవీని నవంబర్ 22న విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేశారు. ఈ సినిమా యూత్‌ని బాగా ఆకట్టుకుంటుందని వారు ఆశించారు.

కానీ, నవంబర్ 22న మరికొన్ని సినిమాలు బాక్సాఫీస్ దగ్గర పోటీ పడుతుండటంతో ఈ సినిమా విడుదల తేదీని  వాయిదా వేశారు. ఈ మేరకు చిత్ర యూనిట్ అధికారికంగా ఓ ప్రకటన కూడా విడుదల చేసింది. అందరూ థియేటర్లలో చూడాలనే ఉద్దేశ్యంతో ఈ సినిమాను నవంబర్ 28న ప్రేక్షకుల ముందుకు తీసుకుని రానున్నట్లు వారు తెలిపారు. ఈ సినిమాను డైరెక్టర్‌  విక్రమ్ రెడ్డి దర్శకత్వం వహిస్తుండగా, ఇప్పటికే విడుదలైన పోస్టర్స్, టీజర్, ట్రైలర్లు మంచి బజ్‌ని ప్రేక్షకుల్లో క్రియేట్ చేశాయి.

ఇక ఈ సినిమాను ప్రముఖ నిర్మాత బెక్కెం వేణుగోపాల్ సృజన్ కుమార్ బొజ్జంతో కలిసి తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని.. థియేటర్లలో ప్రేక్షకులు బాగా ఎంజాయ్ చేస్తారని మేకర్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు.

Related Posts

Comments

spot_img

Recent Stories